Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఇది ముమ్మాటికి బి ఆర్ యస్ విజయమే

-ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగివచ్చిన మోడీ
-బిడ్డింగ్ లో పాల్గొంటున్నందుకే వెనకడుగు
-అందులోనూ ఆంద్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే
-స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం
-ఏపీ మంత్రుల మాటలు పరిపక్వతతో కూడినవి
– మంత్రి జగదీష్ రెడ్డి

విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి బి ఆర్ యస్ సాధించిన విజయంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన మోడీ సర్కార్ ఒకడుగు వెనెక్కి తగ్గిందన్నారు.తెలంగాణా రాష్ట్రం తరపున రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొంటున్నందునే కేంద్రం ఈ నిర్ణయం టుకుందన్నారు.ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే మర్మం దాగి వుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఆంద్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల నేపద్యంలో అక్కడి ప్రజలను నమ్మించే ఎత్తుగడలలో ఇది భాగమై ఉండొచ్చు అన్నారు.ఎట్టి పరిస్థితి లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైట్ పరం కానివ్వబోమంటూ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వతతో కూడినవంటూ ఆయన ఒక ప్రశ్నకు బదులుగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE