– బ్యాక్ గ్రౌండ్ మార్చిన మన్విత్ కృష్ణారెడ్డి లాంటి వెధవలు రేపు తల్లిదండ్రుల్ని, భార్యల్ని కూడా మారుస్తారు
– కృష్ణా అని..మరోసారి కృష్ణాచౌదరి అని పేరుపెట్టుకొని సోషల్ మీడియాలో మాట్లాడుతూ, కా వాలనే ప్రజల్లో టీడీపీపై విద్వేషాలు రాజేస్తున్నాడు
– సజ్జల, అతనికొడుకు భార్గవ్ రెడ్డిలు ఇలాంటి నీతిమాలిన పనులకు ఎన్నాళ్లుపాల్పడతారు?
– ఇన్ని దుర్మార్గాలుచేసిన జగన్ ను ప్రజలు మరలానమ్మాలా? ఎలా నమ్ముతారు?
• జగన్మోహన్ రెడ్డి తన రాజకీయలబ్ధికోసం ఆ ఇద్దరిద్వారా చేయాల్సిన ఛండాలమంతా చేయిస్తున్నారు.
• మన్విత్ రెడ్డికి టీడీపీనేత వేషంవేసి, బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు బొమ్మపెట్టి తప్పుడు ప్రచారం చేయించారు.
• వారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినచర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వారి వ్యవహారంపై తాము సీఐడికి ఫిర్యాదు చేయబోతున్నాం.
• అధికారం కోసం జగన్ ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని, కుట్రల్నే నమ్ముకుంటాడు అనడానికి కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్యకేసులే నిదర్శనం.
• జగన్ ను నమ్మి, మరలా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ పై ప్రజల అపనమ్మకం ఏస్థాయికి వెళ్లిందంటే, సొంత తల్లి, చెల్లే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికేలా చేశాడనే స్థాయికి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
తెలుగుదేశంపార్టీ నాయకుల ముసుగులో, ప్రజల్ని రెచ్చగొట్టడమే ధ్యేయంగా, ప్రాంతాలు, మతాలు, కులాలమధ్య చిచ్చుపెట్టేలా కొందరు విద్వేషాలు రాజేస్తున్నారని, ఆకోవకు చెందిన ఒక దిక్కుమాలిన వెధవే కడపకు చెందిన రామాల మన్విత్ కృష్ణారెడ్డి అని, వాడే ఫేక్ బ్యాక్ గ్రౌండ్ తో ఫేక్ టీడీపీ నాయకుడిలా చెలామణి అవుతూ, ఆర్.ఎం.కే.ఆర్ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయలబ్ధికోసం చేయాల్సిన ఛండాలమంతా చేస్తున్నాడు అని టీడీ పీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు భార్గవ్ రెడ్డి, కరుడుగట్టిన వైసీపీనాయకుడు రామాల మన్విత్ రెడ్డి ఫేక్ వీడియాలతో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. “వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి చూస్తున్నా డు. అతను ఆ పార్టీ సోషల్ మీడియాను ఎంత దుర్మార్గంగా నడిపిస్తూ, తిరిగి జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి దారుణాలు అన్నీ చేయిస్తున్నాడు. వైసీపీకి చెందిన మన్విత్ కృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేయడం…దానిలో టీడీపీనాయకుడిగా వేషం వేయడం.. బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు బొమ్మపెట్టడం ప్రజల్ని ఏమార్చడానికి కాదా? జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంకోసం బ్యాక్ గ్రౌండ్ మార్చిన మన్విత్ కృష్ణారెడ్డి లాంటి వెధవలు రేపు తల్లిదండ్రుల్ని, భార్యల్ని కూడా మారుస్తారు. జగన్ అధికారంలోకి రావడానికి ఇలాంటి పెడదారుల్నే ఎంచుకుంటారు అంటాం.. కాదనిచెప్పగలరా? జగన్ ను మరలా ము ఖ్యమంత్రిని చేయడానికి సజ్జల, అతనికొడుకు భార్గవ్ రెడ్డిలు ఇలాంటి నీతిమాలిన పనులకు ఎన్నాళ్లుపాల్పడతారు? మన్విత్ కృష్ణారెడ్డి పేరు, ఊరు, చేసే పని అంతా అబద్ధమే. ఒకసారి కృష్ణా అని..మరోసారి కృష్ణాచౌదరి అని పేరుపెట్టుకొని సోషల్ మీడియాలో మాట్లాడుతూ, కా వాలనే ప్రజల్లో టీడీపీపై విద్వేషాలు రాజేస్తున్నాడు.
కోడి కత్తి డ్రామా జగన్ ఆడిందికాదా? శ్రీనివాస్ అనేవాడు వచ్చి తనభుజంపై పొడుస్తాడని జగన్ కు ముందే తెలియదా? కరెక్ట్ గా భుజంపైనే కోడికత్తితో పొడవమని శ్రీనివాస్ కుచెప్పి, తనపథకాన్ని తూచాతప్పకుండా అమలుచేయించింది జగన్ కాదా? భుజంపై కోడికత్తితో పొడిస్తే మనిషి చచ్చిపోడని తెలిసే, శ్రీనివాస్ తో ముందే ట్రైనింగ్ ఇచ్చిమరీ విశాఖ విమానాశ్ర యంలో జగన్ ఇలాంటిపథకరచన చేశాడు. అధికారం కోసం ఇంతలా గడ్డికరవాలా అని జగన్ ను ప్రశ్నిస్తున్నాం? ముఖ్యమంత్రి కావడానికి సానుభూతికోసమే జగన్, తనబాబాయ్ ను కూడా చంపించాడు అనే అనుమానం కలుగుతోంది. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు హత్యకేసువిచారణపై సీబీఐ దర్యాప్తు కోరుతూ, కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? ఇన్ని దుర్మార్గాలుచేసిన జగన్ ను ప్రజలు మరలానమ్మాలా? ఎలా నమ్ముతారు?
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొనే జగన్ దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందాడు. 2004కు ముందు జగన్ ఆస్తులెన్ని…ఇప్పుడెన్ని?
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొనే జగన్ దేశంలోనే అత్యంతధనవంతుడిగా రూపాంతరం చెందాడు. ఏంకాయకష్టంచేసి జగన్ వేలకోట్లు సంపాదించాడు? 2004కు ముందుజగన్ కు , అతనికుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని..ఇప్పుడెన్ని? కడపలోని ఇడుపులపాయ, పులివెందులలోని ఆస్తులు, భూములు,ప్యాలెస్ లు ఎక్కడివంటే జగన్ సమాధానంచెప్పరు? బెంగు ళూరులో, హైదరాబాద్ లోని రాజభవనాలు ఎక్కడివి..ఎలా వచ్చాయంటే నోరుమెదపరు? తనపేరుతో, తనకుటుంబంపేరుతో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎలావచ్చాయో జగన్ ప్రజల కు చెప్పగలరా? వాటిపుట్టుకకు సంబంధించిన వివరాల్ని బహిర్గతం చేయగలరా? ఇన్ని తప్పులు, దారుణాలు చేసిన జగన్ ను ప్రజలు నమ్మాలా? నమ్మి మరలా ముఖ్యమంత్రిని చేయాలా?
జగన్ పై ప్రజల అపనమ్మకం ఏస్థాయికి వెళ్లిందంటే… సొంతతల్లి, చెల్లే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికేలా చేశాడని చెప్పుకునే స్థాయికి. జగన్ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మేస్థితిలో ఏపీ ప్రజలు లేరు
ఆంధ్రప్రజలు జగన్ ను నమ్మడంకాదు. ఆయనపైఉన్న నమ్మకం ఏస్థాయికివెళ్లిందో తెలుసా ? ఆయనతల్లి విజయమ్మ, చెల్లిషర్మిల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారని చెబు తున్నారు. మరలా ముఖ్యమంత్రికావడంకోసం జగన్ తనతల్లిని, చెల్లిని కూడా లేపేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో లబ్ధికోసం, ప్రజల్లోసానుభూతికోసం మీరు ఎంతకైనా తెగి స్తారని మీ తల్లి, చెల్లి గజగజవణుకుతున్నారు. వారికి ప్రానహానిలేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెబుతున్నాం. వేటగాడి చేతిలోనేపావురాలను పెట్టి, వాటిని కాపాడాలని ఆయనకే చెబుతున్నాం.
వైసీపీకి లబ్ధిచేకూర్చడంకోసం, టీడీపీముసుగులో మన్విత్ కృష్ణారెడ్డి అనే వెధవ చేసే నీతిమాలిన పనుల్ని ప్రజలు గ్రహించాలి. వాడు దళితు ల్ని కూడా ఇష్టానుసారం తిట్టాడు. దళితులకు చదువులెందుకుఅని, కులవృత్తితో బతకాలని నోరుపారేసుకున్నాడు. మన్విత్ కృష్ణారెడ్డి కులంఏమిటి.. అతని వృత్తి ఏమిటి? ఈ విధంగా వైషమ్యాలు రేకెత్తించేలా ప్రజల్లో ద్వేషభావం పెంపొందించేలా మాట్లాడుతున్న మన్విత్ కృష్ణా రెడ్డిని, అతనితో చేయకూడని పనులు చేయిస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.
తన కొడుకు చేసే నీతిమాలిన పనులు సజ్జల రామకృష్ణారెడ్డికి కనిపించడంలేదా? మన్విత్ కృష్ణారెడ్డి వ్యవహారంపై, అతన్నినడిపిస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిపై సీఐడీకి ఫిర్యాదుచేస్తున్నాం. సదరు సీఐడీ విభాగం స్పందించకపోతే, తగినరీతిలో ముందుకెళ్తాం. ఫేక్ ప్రాపకాండతో జగన్ చేస్తు న్నవిషప్రచారాన్ని ప్రజలు నమ్మేస్థితిలోలేరు. 2004లో ఏమీలేని జగన్, ఇప్పుడు అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ప్రజలకు అర్థమైంది. సరైన సమయంలో వారు సరైనరీతిలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సమాధానంచెబుతారు. ఇదేపంథాను అనుసరిస్తే జగన్ కూడా చరిత్రలో ఒక ఫేక్ ముఖ్యమంత్రిగానే నిలిచిపోతాడు” అని రామయ్య తేల్చి చెప్పారు.