Suryaa.co.in

Telangana

శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్‌కి కేసీఆర్ ఆశీస్సులు

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. ఆంజనేయగౌడ్ తన జన్మదినం సందర్భంగా కేసీఆర్‌ను కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, స్టేడియాల అభివృద్ధి, వసతి సౌకర్యాల కల్పనపై తీసుకుంటున్న చర్యలను ఆంజనేయగౌడ్ సీఎంకు వివరించగా, సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. జాతీయ స్థాయిలో తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని ఆంజనేయగౌడ్ మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నేతలు, ఉస్మానియా విద్యార్ధి సంఘ నేతలు ఆంజనేయగౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

LEAVE A RESPONSE