-24న గుంటూరులో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
-చట్ట సంస్థలు చేసే పనికి, రాజకీయ వ్యూహాలకు సంబంధం లేదు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన తూర్పు నియోజకవర్గంలోని ఉమాశంకర్ కార్యాలయం నందు తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పశ్చిమ అసెంబ్లీ కన్వీనర్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో పలు పార్టీల నుంచి మైనారిటీ నేతలు సుమారు 150 మంది బీజేపీలో చేరిక. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఏమన్నారంటే….
సామాన్య ప్రజానీకానికి నరేంద్ర మోడీ పరిపాలన గురించి తెలుసు.రాబోయే రోజుల్లో గుంటూరు నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ లో చేరబోతున్నారు.లిక్కర్ పాలసీ లో అడ్డంగా దొరికిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.అవినీతి మయమైన భారత దేశ రాజకీయాలను కమలం ప్రక్షాళన చేస్తుంది.సావర్కర్ ను విమర్శించే అర్హత రాహుల్ గాంధీ కి లేదు. ఈరోజు కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉన్నారు.కాశ్మీర్ లో టెర్రరిస్టు అనే వారే లేకుండా పోయారు..
పేద ప్రజలందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి బియ్యం సరఫరా చేయమని రాష్ట్రాలకు మోడీ సూచించారు. ప్రతి సంవత్సరం 5వేల కోట్ల రూపాయల బియ్యం కుంభకోణం రాష్ట్రంలో జరుగుతుంది. పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేక పోతుంది. అమరావతి లో కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా ఇసుక తరలింపు జరుగుతుంది.అడ్డు కోబోయిన బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడులు చేశారు.ఇంతవరకు కేసులు కట్టకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు.వెంటనే బీజేపీ నాయకులపై దాడులు చేసిన వారిపై కేసులు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ లో థర్మల్ పవర్ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద ను, 1985 నుండి స్థానికులు సేకరించి అమ్ముకునేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక కొందరు అధికారపార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. పులివెందుల విషయంలో కానీ, ఢిల్లీ కేజ్రీవాల్ విషయంలో కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.
రాబోయే ఎన్నికల్లో జనసేన తో కలిసి పోటీ చేయబోతున్నాం. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమాలు చేస్తాం. 24న గుంటూరులో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీటిపై చర్చిస్తాం. సిబిఐ ఎక్కడ పని చేస్తున్నా అక్కడి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణాలో నాయకులు ఆందోళన చేస్తున్నారు.చట్టాలు వాటిపని అవి చేసుకుంటాయనేందుకు ఇది సంకేతం. చట్ట సంస్థలు చేసే పనికి, రాజకీయ వ్యూహాలకు సంబంధం లేదు. వాళ్ల తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జి సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపరాణి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు భాష.. షేక్ గౌస్ పిరా నేతృత్వంలో నూతనంగా చేరిన వారిలో షేక్ రఫీ, షేక్ ఈసుబ్, డేవిడ్ రాజు, ఖాజావలి, దేవరాజు, డాక్టర్ పి.బలరాం, సురేష్, కిరణ్, షేక్ ముంతాజ్, షేక్ ఫర్ హానా, సవిత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్లు భాస్కర్, అప్పిశెట్టి రంగా, కుమార్ గౌడ్ మంత్రి సుగుణ, కోలా రేణుకాదేవి, రమాదేవి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గోడ పైన వాల్ రైటింగ్ చేసిన సోము వీర్రాజు
బిజెపి దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మరొక్కసారి మోడీ సర్కార్ నినాదంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎదురుగా గల గోడ పైన వాల్ రైటింగ్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంటుకు వరకు పార్టీని విస్తరించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ కి నాలుగేసి చొప్పున వాల్ పెయింటింగ్స్ వేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జి సురేందర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్సులు రాచుమల్లు భాస్కర్, అప్పిశెట్టి రంగా, గారపాటి పూర్ణ, వనమా నరేంద్ర, టీవీ రావు, గాజుల వెంకయ్య నాయుడు, పద్మనాభం, తోట శ్రీనివాసరావు, వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.