– పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం
భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగ తల్లి. హిందువులు పుష్కర స్నానం పవిత్రమైనది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు అతి పెద్ద నమ్మకం. ఇప్పుడు ఎక్కడ కనిపించినా నాగ సాధువులు, అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు. పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది.
గంగా పుష్కరం బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3, 2023న ముగుస్తుంది.
బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.
పుష్కరుడు కథ:
పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడు అని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థ రాజు అని పిలుస్తారు. సామాన్యులు అందరూ నది స్నానం చేయడం వల్ల ఆ నది పవిత్రత క్షీణించడానికి గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు. దాని కోసం పరమ శివుడి కోసం తపస్సు చేసి నదుల దోషములన్నిటిని ప్రక్షాళన చేసే మార్గాన్ని అర్థించాడు. అతని తప్పసుకి మెచ్చి శివుడు పుష్కరుడుకి తను కోరిన వరం ఇస్తాడు. శివుని వరం వల్ల పుష్కరుడు పవిత్రుడు మరియు అనంతమైన శక్తి ప్రాప్తించింది అవుతారు. పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడో ఆ నది పవిత్రం అవుతుంది.
నదులలోని పాపాలన్నింటినీ తొలగించ గలగే వరం లభించింది. ఆ కారణం వల్ల 12 నదులన్నీ తమలో పవిత్రత నింపాలి అని పుష్కరుడు కోరుకుంటాడు. అటుపిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టీ పుష్కరాలు నిర్ణయించబడతాయి. అంటే మిథున రాశి, వృషభ రాశి, మేష రాశి, కన్య రాశి ఎలా మోతం అన్నీ రాశిలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో, అప్పుడే పుష్కరుడు నదులలో నివసించేలా చేసుకుంటాడు.
పుష్కరుడు ప్రవేశిస్తుంచిన మొదటి 12 రోజులను పుష్కరాలు అని అంటారు. ఒక సంవత్సరం పాటు ఆ నదిలో ఉంటారు కానీ ఆది పుష్కరం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక్క 2 ముహూర్త కాలంలో మాత్రమే ఉంటారు.దేవగురుడైన బృహస్పతి పన్నెండు రాశుల్లోనూ ఏడాదికి ఒకరాశి, చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఒక రాశినుంచి మరో రాశిలోనికి మారిన మొదటి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతదేశంలోని పన్నెండు పవిత్రనదులకు వరుసగా పుష్కరాలు ఉంటాయి. ఆ ప్రకారం… 2023 ఏప్రిల్ 22 శనివారం నుంచి 2023 మే 3 బుధవారం వరకు గంగానది పుష్కరాలు నిర్వహిస్తారు.
భారతీయులకు గంగానది అత్యంత పవిత్రమైనది. స్వర్గలోకంలో ఉండే మందాకినిని భగీరధుడు తన తపస్సుతో నేలకు రప్పించాడని చెబుతారు. మూడు లోకాల్లోనూ ప్రవహించే కారణంగా గంగను త్రిపథగ అని పిలుస్తారు. గంగానది పుట్టిన గంగోత్రి, హరిద్వార్, వారణాశి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గంగానది పుష్కర విధులను ఆచరించవచ్చు. పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధవిధులు నిర్వహిస్తారు. పుష్కర స్నానం, దానం అత్యంత పుణ్యప్రదాలు.
గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు:
1. వారణాసి
2. గంగోత్రి
3. హరిద్వార్
4. బద్రీనాథ్
5. కేదార్నాథ్
6. ప్రయాగ
7. అలహాబాద్
వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.
గంగా ఘాట్లలో చేయవలసినవి & చేయకూడనివి:
1. నది ప్రాంగణాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి.
2. పూజ లేదా ఏదైనా వివరాల కోసం నమోదిత పురోహితులను మాత్రమే సంప్రదించండి.
3. క్యూ పద్ధతిని అనుసరించండి.
4. నదిలో వ్యర్థ పదార్థాల ద్వారా వెళ్లవద్దు.
5. ఘాట్లో స్నానానికి సబ్బులు, షాంపూలు ఉపయోగించవద్దు.
6. నాణేలు మరియు ఇతర వస్తువులను నదిలో వేయవద్దు.
7. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు వైద్య వ్యర్థాలతో నదిని కలుషితం చేయవద్దు.
ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి?
1. మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు,
2. వృషభ రాశి యందు ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరము,
3. మిథున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరాలు,
4. కర్కాటక రాశి యందున్న యమునా నదికి,
5. సింహరాశి యందున్న గోదావరి నదికి,
6. కన్యారాశి యందున్న కృష్ణానదికి,
7. తుల యందున్న కావేరీ నదికి,
8. వృశ్చిక రాశి యందున్న భీమరథీ నదికి,
9. ధనూరాశి యందున్న పుష్కర నదికి,
10. మకరమందున్న తుంగభద్రా నదికి,
11. కుంభ మందు సింధునదికి,
12. మీన రాశి యందు ప్రణీత నదికి పుష్కరాలు ఏర్పడును.
వారణాసిలో తెలుగు వెలుగు మన జీవీఎల్
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం వారణాసిలో గంగాపుష్కర ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జీవీఎల్.. ఎంపిగా వారణాసిని, నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకున్నారు. దానితో ఏర్పాట్ల కమిటీకి చైర్మన్గా ఉన్న జీవీఎల్.. గత కొద్దిరోజుల నుంచి వారణాసిలోనే ఉండి, అధికారులతో కలసి ఘాట్లను పరిశీలిస్తున్నారు.
‘ఇది పేరుకు గంగా పుష్కరాలయినప్పటికీ,దేశంలో అన్ని ప్రాంతాలవారికంటే తెలుగువాళ్లే ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల వారి బస, స్నానాలు, భోజన సౌకర్యాలను పర్యవేక్షించవలసి ఉంది. ఒక తెలుగువాడిగా వారికి సేవచేయడం నాకు లభించిన అదృష్టం. ఇక్కడి తెలుగు సత్రాలతో కూడా సమన్వయం చేస్తున్నాం’’ అని జీవీఎల్ వెల్లడించారు.
కాగా కరోనా సమయంలో వారణాసిలో, తెలుగు భక్తులు చిక్కుకున్న విషయం తెలిసిన జీవీఎల్.. వారిని స్వస్థలాకు చేర్చేందుకు, రవాణా సౌకర్యం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే వారణాసిలో జరిగే, గంగా పుష్కరాలకు తరలివచ్చే తెలుగువారికి ఏర్పాట్లు చేస్తుండటం అభినందనీయం.