– సాక్షిలో రాసేవే సత్యాలు, మీరు మాట్లాడేవా నీతులా సజ్జలా ?
– వివేకాను చంపిందెవరో మీడియా చెబితే సహించలేని సజ్జలకు..సాక్షిలో వివేకానందరెడ్డి విటుడు అంటూ ప్రచారం చేస్తే సంతృప్తిగా ఉందా?
– దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్ధను దొంగలు తప్పు పట్టడం వింతగా ఉంది
– సాక్షి మీడియా పెట్టి జర్నలిజం విలువలు దిగజార్చిన వాళ్లే జర్నలిజంలో విలువల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
గజదొంగే దొంగా దొంగా అని అరుస్తున్న చందంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. వివేకా హత్యలో అసలు నిందితులెవరో తేలాక కూడా సజ్జల సిగ్గు శరం వదలి అచ్చోసిన ఆంబోతులా మీడియాపై విషం కక్కడం దుర్మార్గం. హత్యతో సంబదంల లేని చంద్రబాబు నాయుడి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అంటూ వార్తలు రాసిన మీరా జర్నలిజం విలువల గురించి మాట్లాడేది? సాక్షిలో రాసేవే సత్యాలు మీరు మాట్లాడేవే నీతులా? సాక్షి మీడియా పెట్టి జర్నలిజం విలువలు దిగజార్చిన వాళ్లే జర్నలిజంలో విలువల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు .నిజాలు నిక్కచ్చిగా చెప్పే మీడియాపై జగన్ రెడ్డికి, సజ్జలకి అంత అక్కసు ఎందుకు ? వివేకానందరెడ్డిని చంపిందెవరో మీడియా చెబితే సహించలేని సజ్జలకు..సాక్షిలో వివేకానందరెడ్డి విటుడు అంటూ ప్రచారం చేస్తే సంతృప్తిగా ఉందా?
వివేకానందరెడ్డి హత్యను మొదట చంద్రబాబుకు, తర్వాత సునీతారెడ్డికి అంటగట్టారు. వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అక్రమ సంబందాలంటూ కధలు అల్లారు. జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ కి వచ్చే సరికి సీబీఐ దర్యాప్తును తప్పుపడుతున్నారు. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో సజ్జల చెబుతారా? సీబీఐ దర్యాప్తు ఫాల్స్ అయితే మీరు అధికారంలోకి వచ్చాక సిట్ వేసి కూడా నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు?
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్ధను దొంగలు తప్పుపట్టడం విడ్డూరంగా ఉంది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడంటూ గుండెలు బాదుకుంటూ డ్రామాలాడింది అవినాశ్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు కాదా? వివేకా హత్య కేసును చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండా వాడుకుంటున్నారన్ని సజ్జల అనటం సిగ్గుచేటు. సొంత బాబాయిని చంపి అక్రమ సంబందాలు అంటగట్టిన వైసీపీ నేతలకు చంద్రబాబుపై ఆరోపణలు చేయటం ఓ లెక్కా? అంతరిక్షంలో అగ్ని ప్రమాదం జరిగినా జగన్ రెడ్డి ఇంట్లో హత్య జరిగినా దానికి చంద్రబాబే కారణమా? మీరు ఎన్ని డ్రామాలాడినా వివేకా హత్యలో దోషులు తప్పించుకోలేరు.