– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్
విజయ్ రమార్ స్వామి గురించి దుష్ర్పచారం చేస్తున్నారన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు. 6 గంటల సేపు స్వామితో ఎవరైనా ఆశీర్యాదం తీసుకుంటారా? ఇది లాబీయింగ్ కాకపోతే మరేంటి? వివేకా హత్య కేసులో అన్ని వేల్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. తాడేపల్లికి త్వరలో సీబీఐ రాబోతోందన్న భయంతోనే జగన్ రెడ్డి ఉన్నారు. డిల్లీలో లాబీయింగ్ అయిపోయింది, ఇప్పుడు స్వాములతో లాబీయింగ్ మొదలెట్టారు. విజయ్ కుమార్ వచ్చింది రామోజీరావు వియ్యంకుడి తమ్ముడి విమానం అంటున్నారు. కానీ రామోజీరావు వియ్యంకుడికి అతని తమ్మడుకి విభేదాలున్నది వాస్తవం కాదా? వారి మద్య గొడవలు పెట్టింది వైసీపీ నేతలు కాదా? జగన్ రెడ్డికి స్వాముల పట్ల అంత భక్తి ఉంటే శ్రీరామ నవమికి ఒంటి మిట్ట వెళ్లకుండా కాలి నొప్పి సాకుతో ఎందుకు ఎగ్గొట్టారు ? కాలు నొప్పి అయితే ఆ మరుసటి రోజే చిలకలూరి పేట సభకు ఎలా వెళ్లారు?