Suryaa.co.in

Andhra Pradesh

యువగళం సైనికులారా.. వందనం!

-వెయ్యి కిలోమీటర్లకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర
-తన దళానికి కృతజ్ఞతలు చెప్పిన లోకేష్
-లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్పూర్తిని కొనసాగించాలి!
-యువగళం సైనికులకు లోకేష్ అభినందనలు

1000 కి.మీ. చేరుకున్న సందర్భంగా యువనేత పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను యువనేత నారా లోకేష్ అభినందించారు. అధికారపార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనవరి 27న పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో సేవలందిస్తున్న వివిధ కమిటీలు, వాలంటీర్లను యువనేత లోకేష్ పేరుపేరునా అభినందిస్తూ… లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు.రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం యువనేతను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

1. యువగళం పాదయాత్ర మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్.
2. యువగళం అధికార ప్రతినిధులు – ఎం ఎస్ రాజు, దీపక్ రెడ్డి.
3. మీడియా కమిటీ – మెయిన్ కోఆర్డినేటర్ బి.వి. వెంకట రాముడు, సభ్యుడు జస్వంత్.
4. భోజన వసతుల కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, సభ్యుడు లక్ష్మీపతి.
5. వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ – రవి నాయుడు, ప్రణవ్ గోపాల్.
6. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – రవి యాదవ్.
7. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
8. వసతి ఏర్పాట్ల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా కృష్ణ, శ్రీధర్, ఐనంపూడి.రమేష్.
9. యువగళం పిఆర్ టీమ్ – కృష్ణా రావు, మునీంద్ర, కిషోర్.
10. యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్ – కౌశిక్, అర్జున్.
11. అలంకరణ కమిటీ – మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం.
12. రూట్ వెరిఫికేషన్ కమిటీ – అమర్నాథ్ రెడ్డి, కస్తూరి కోటేశ్వరరావు.
13. తాగునీటి సదుపాయం – భాస్కర్, వెంకట్
14. సెల్ఫీ కోఆర్డినేషన్ – సూర్య

LEAVE A RESPONSE