Suryaa.co.in

Andhra Pradesh

అసలైన కిల్లర్ ఫిష్ కథ ముగిస్తేనే, వివేకా ఆత్మకు శాంతి, రాష్ట్ర ప్రజలకు సంతోషం

– వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఇప్పటివరకు పట్టుకుంది చిన్నచేపల్నే
• బాబాయ్ ని చంపినవారెవరో తెలిసిన జగన్ వారిని కాపాడటకోసం తన అవినీతి మీడియాను నమ్ముకున్నాడు.
•లాబీయిస్టులు, ప్రముఖలాయర్లు, పైరవీలతో ఉపయోగంలేకపోవడంతో, జగన్ తన అవినీతిమీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నాడు.
• వివేకాహత్యకేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండటంతో అసలు దోషులు అల్లాడిపోతున్నారు.
• నీతిమాలిన విషప్రచారంతో ముఖ్యమంత్రి, అతని అవినీతిమీడియా దోషుల్ని కాపాడలేవు.
• వివేకాహత్యకేసులో నిందితుల్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డేనన్న ప్రజలకు తెలిసిన పచ్చినిజం.. సాక్షి మీడియాకు తెలియదా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

సొంతచిన్నాన్నను చంపిన హంతకుల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాయ డం, నిందితులకు అండగా ఉండటంవల్లే, హత్యకేసు విచారణ జాప్యం జరిగిందని, సీబీఐ దోషుల్ని శిక్షించడానికి ప్రయత్నిస్తుంటే, తన అన్నే అడ్డుకుంటున్నాడని వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోర్టుల్నిఆశ్రయించిందని, ఆమెచేస్తున్న అసమాన పోరాటం వల్లే తాడేపల్లి ప్యాలెస్ లో అలజడి మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“వివేకాహత్యకేసు నిందితుల్ని కాపాడటానికే జగన్ తనలండన్ పర్యటన రద్దుచేసుకున్నా డు. జగన్ లాబీయిస్ట్ ను రంగంలోకి దించడంవల్లే, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాలేదు. బాబాయ్ హత్యకేసులో నిందితుల్ని జగనే కాపాడుతున్నాడని చిన్నపిల్లలకు కూడా అర్థమైంది. కానీ జగన్ సొంతపత్రిక, అవినీతిపత్రిక సాక్షిలో మాత్రం ఇప్పటికీ పనికిమాలిన కథనాలు వండి వారుస్తున్నారు. ‘వివేకాహత్యకేసులో హంతకుల్ని నడిపిస్తున్నదెవరు’ అని సాక్షిలో అచ్చేసి న కథనానికి జవాబు జగన్మోహన్ రెడ్డే అనడంలో ఎలాంటి సంశయంలేదు. సుప్రీంకోర్టు ఈ నెలాఖరులోపు వివేకాహత్యకేసు విచారణను ముగించమని ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి లాబీ యిస్ట్ లను రంగంలోకి దించి, నిందితుల్ని కాపాడుతున్నాడు. వివేకా కుమార్తె సునీత అవి నాశ్ రెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, దానిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయ మూర్తి తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతరబెయిల్ పై స్టే విధించారు.

వివేకాహత్య జరిగిన నాడు సాక్షి మీడియాలో వండివార్చిన తప్పుడు కథనాలు, విషపురాతలు..ఇప్పుడు సాక్షిలో రాసినరాతలు చూశాక, సదరు బ్లూమీడియా నిర్వాహకులకు సిగ్గుశరం, మానంమర్యాద, ఇంగితజ్ఞానం ఉన్నాయా అనిపిస్తోంది

2019 మార్చి15న సాక్షిటీవీలో మొట్టమొదటిసారి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. తరువాత విజయసాయి మాట్లాడుతూ గుండెపోటు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రక్తపు వాంతులతో చనిపోయాడని, మరలా చంద్రబాబు చంపాడని ఇష్టానుసారం మాట్లాడాడు. వివేకాహత్యపై సాక్షిపత్రికలో వండివారుస్తున్న తప్పుడు కథనాలకు అంతేలేదు. 2019 మార్చి23న సాక్షిపత్రికలో నారాసుర రక్తచరిత్ర అని బ్యానర్ ఐటమ్ వేశారు. వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపాడని నీతిమాలిన రాతలు రాసింది. ఈరోజున ‘వివేకాహత్యకేసులో హంతకుల్ని నడిపిస్తున్నదెవరు’ అంటూ దిగజారుడు రాతల కు తెరలేపింది. సాక్షి మీడియాకు, దానినిర్వాహకులకు ఇంగితజ్ఞానం, మానం మర్యాద, సిగ్గులజ్జ ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. అనుమానం కాదు…లేవనే చెప్పాలి. హత్యకేసు విచారణలో భాగంగా వివేకాహత్యకు ఎక్కడ, ఎప్పుడు బీజంపడింది…ఎవరు హ త్యకు పథకరచన చేశారు..ఎవరు చంపారు అనేవివరాలపై సీబీఐ స్పష్టంగా తన ఛార్జ్ షీట్లో పేర్కొంది.

వివేకానందరెడ్డి బతికుంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని అవినాశ్ రెడ్డి, వివేకా బతికుంటే, తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు కూడా ఆస్తిలో సమానభాగం ఇవ్వా ల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆక్రమంలో ఇద్దరూ కలిసే క్రైమ్ థ్రిల్లర్ సినిమా ను మించిపోయేలా హత్యకు పథకరచనచేసి అమలుచేశారు. తరువాత ఏమీ తెలియనట్టు ఆస్కార్ నటుల్ని మించిపోయేలా అమాయకంగా నటిస్తున్నారు. ఎన్నోహత్యకేసుల్ని దర్యాప్తుచేసిన సీబీఐ సంస్థే జగన్ తీరుకి నివ్వెరపోతోంది. వైసీపీతరుపున పోటీచేసిన వివేకానందరెడ్డిని ఓడించింది అవినాశ్ రెడ్డి, అతనతండ్రి భాస్కర్ రెడ్డే. వివేకా బతికుంటే తమకు రాజకీయమనుగడ లేదనిభావించే ఆ ఇద్దరూ ఆయన్ని లేపేయాలని నిర్ణయించు కున్నారు. కడపఎంపీ టిక్కెట్ మనకుటుంబంలోని వారికేఇవ్వాలని, అవినాశ్ రెడ్డికి ఇవ్వవ ద్దని వివేకా పట్టుబట్టడంకూడా అవినాశ్ రెడ్డిలో వివేకాపై ఆగ్రహావేశాలు రేకెత్తాయి.

వివేకాహత్యకేసులో సీబీఐ రోజుకో నిజం బయటపెడుతుంటే, జగన్ అతని దిక్కుమాలిన ప్రభుత్వం, అవినీతి మీడియా సిగ్గులేకుండా బుకాయింపులకు పాల్పడుతోంది
హత్యజరిగినప్పుడు వివేకాను చంపినవారిని కఠినంగా శిక్షించాలని, సీబీఐతో దర్యాప్తు జరి పించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు? ఎందుకు వెనక్కుతీసుకున్నాడనే ప్రశ్నకు జగన్ ఇప్పటికీ సమాధానం చె ప్పడంలేదు. సాక్షిమీడియాలో వివేకాహత్యపై రోజుకోరకంగా వండివారుస్తున్న నీతిమాలిన కథనాలపై కూడా జగన్ నోరువిప్పడంలేదు. వివేకాహత్యపై రోజుకోకట్టుకథ చెబుతున్న జగన్, అతని సాక్షిమీడియా సీబీఐ బయటపెడుతున్న అంశాలపై ఎందుకు స్పందించడం లేదు? వివేకాచనిపోయినప్పుడు అతనిశవానికి కట్లుకట్టించి, గాయాలకు కుట్లువేయించింది ఎవరు? వివేకా కుమార్తె సునీత, అల్లుడు వచ్చేవరకు ఆగకుండా మృతదేహానికి తూతూ మంత్రంగా పోస్ట్ మార్టమ్ ఎందుకుచేయించారు? చనిపోయినవ్యక్తికి ముస్లిం మహిళతో అక్రమసంబంధం అంటగట్టడం.. అతని వ్యక్తిగతజీవితాన్ని భ్రష్టుపట్టించేలా దుష్ప్రచారం చేయడం చేశారు. సునీల్ యాదవ్ తల్లితో వివేకాకు అక్రమసంబంధం ఉందని చెప్పడం ఏమిటివన్నీ. ఇలా నీతిమాలినప్రచారాలతో ఎన్నాళ్లు ముఖ్యమంత్రి, అతని అవినీతి మీడి యా దోషుల్ని కాపాడటానికి ప్రయత్నాలుచేస్తుంది? సీబీఐ గూగుల్ టేకౌవుట్ ద్వారా తిరుగులేని సాక్ష్యాధారాలు సంపాదించి, నిందితుల్ని విచారిస్తూ, అసలుదోషుల్ని శిక్షించడా నికి ముందుకెళ్తున్నాకూడా ముఖ్యమంత్రి, అతని దిక్కుమాలిన అవినీతి మీడియా ఇప్పటికీ బుకాయిస్తోంది? హత్యజరిగినరోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి అవినాశ్ ఎందుకు ఫోన్ చేశాడు? జగన్మోహన్ రెడ్డితో ఏంమాట్లాడాడు? అదేవిధంగా భారతి రెడ్డి అటెండర్ నవీన్ కు ఫోన్ చేసి భారతిరెడ్డితో ఏంమాట్లాడాడు? కాల్ లిస్ట్ ద్వారా సీబీఐ ఈ విషయం బయటపెట్టింది నిజమా…కాదా? సీబీఐ రోజుకో నిజాన్ని బయటపెడు తుంటే, వాటికి సమాధానం చెప్పకుండా, ముఖ్యమంత్రి అతనిదిక్కుమాలిన సాక్షిమీడియా, అతని ప్రభుత్వంలోని కొందరు నీతిమాలినవ్యక్తులు ఇప్పటికీ సిగ్గులేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

సీబీఐకి దొరికింది చిన్నచేపలే… అసలైన కిల్లర్ ఫిష్ ఇంకా చిక్కలేదు. వివేకాహత్యకేసులో నిందితుల్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డేనన్న ప్రజలకు తెలిసిన పచ్చినిజం.. సాక్షి మీడియాకు తెలియదా?
వివేకాహత్యకేసులో సీబీఐ విచారిస్తున్నది, ఇప్పటివరకు అదుపులోకి తీసుకుంది చిన్నచేప ల్నే. అసలైన కిల్లర్ ఫిష్ లు ఇంకా సీబీఐవలకు చిక్కలేదు. వివేకాహత్యజరిగిన రాత్రి అవినాశ్ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఎవరితో ఏంమాట్లాడాడో తెలియాలి. అలానే భారతి రెడ్డి అటెండర్ కు ఫోన్ చేసి ఆమెతో ఏంమాట్లాడాడో తేల్చాలి. అధికారంలో ఉండి వివేకాహత్యకేసును ఎందుకు పరిష్కరించలేకపోయారో సాక్షి పత్రిక ఏనాడైనా జగన్ ను ప్రశ్నించిందా? ప్రజలపొట్టలుకొట్టి సంపాదించిన అవినీతిసొమ్ము ఉందికదా అని సుప్రీంకోర్టు లో, తెలంగాణ హైకోర్టులో వివేకాహత్యకేసు విచారణను అడ్డుకోవడానికి ఇప్పటికి 7 కేసులు వేశారు. అవి ఎవరువేశారో సాక్షిమీడియా ఎందుకు బయటపెట్టదు? కోట్లాది రూపాయలు ఫీజులుగాఇస్తూ, నిందితుల తరపున ప్రముఖ లాయర్లని బరిలో దించుతున్నది ఎవరో ఎందుకు సాక్షిలో రాయరు? సొంతపేపర్లో తప్పుడుకథనాలు వండివారుస్తూ, హత్యకేసు విచారణను అడ్డుకుంటూ, నిందితుల్ని కాపాడటానికి సీబీఐవిచారణను అడ్డుకుంటున్నది జగన్మోహన్ రెడ్డే అనేవాస్తవం సాక్షిమీడియాకు తెలియదా?

ప్రజలకు తెలిసిన పచ్చినిజం పత్రికాయాజమాన్యానికి తెలియదంటే నమ్మాలా? అన్నీతెలిసినా జగన్ ఎప్పుడూ నోరు విప్పడు? సర్వంతెలిసిన సకలశాఖలమంత్రి సజ్జల ఏమీతెలియనట్టే నటిస్తుంటాడు. వివేకా హత్యకేసు నిందితుల్ని నడిపిస్తున్నదెవరు అని సాక్షిలో రాయిస్తున్న జగన్, తనచెల్లి సునీత ను వెంటబెట్టుకొని ఢిల్లీవెళ్లి, ఆమెకున్యాయంచేయమని ఇన్నేళ్లలో జగన్ ఒక్కసారైనా ప్రధానితో మాట్లాడాడా? లాబీయిస్ట్ లను రంగంలోకి దించి నిందితుల్ని కాపాడుతూ, మరోపక్క చేతిలో అవినీతిమీడియా ఉందని విషప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్న జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. సుప్రీంకోర్టుదెబ్బతో వివేకాహత్యకేసులోని పెద్దచేపలు కూడా త్వరలోనే బయటపడబోతున్నాయి. న్యాయం కాస్త ఆలస్యమైతే కావచ్చుగానీ, తప్ప కుండా దోషులుశిక్షింపబడతారు. ఆ భయమే వైసీపీకి, జగన్ కు, అతని బ్లూమీడియాకు పట్టుకుంది. అందువల్లే రోజురోజుకీ బరితెగించి వివేకాహత్యపై విషం కక్కుతున్నారు. ” అని బొండా ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE