Suryaa.co.in

Andhra Pradesh

జయరామ్ కు, తనవర్గానికి జగన్ చేస్తున్న ద్రోహం కనిపించలేదా?

-వాల్మీక వర్గం నుంచి మంత్రి అయిన జయరామ్ కు, తనవర్గానికి జగన్ చేస్తున్న ద్రోహం కనిపించలేదా?
– మంత్రిగా చేసిన కబ్జాలు, అవినీతికి భయపడి జయరామ్ నోరెత్తడంలేదా?
– లోకేశ్ అడిగిన సమాధానంచెప్పకుండా జయరామ్ బూతులు మాట్లాడితే, దానికి పదింతలు మాట్లాడతాం.
టీడీపీఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు

“బూతులుమాట్లాడటం గొప్పకాదని బెంజిమంత్రి తెలుసుకోవాలి. మేం కూడా మంత్రికి అదే స్థాయిలో సమాధానంచెప్పగలం. మంత్రి వాడిన భాషకంటే దారుణమైన భాషను తాము మాట్లాడగలం. కానీ మానాయకుడు మంత్రిచేసిన అవినీతి, తప్పుల్నేఎత్తిచూపాలని చెప్పారు. బాబాయ్ ని చంపిన కేసులో త్వరలోనే జగన్ జైలుకెళ్లబోతున్నాడు. అలాంటి వ్యక్తి చెబితే జయరామ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడా? లేక సొంతతెలివి, సోయి ఉండే మా ట్లాడుతున్నాడా? జయరామ్ భాష, పద్ధతి, ప్రవర్తన చూశాక, రాష్ట్రంలోని వాల్మీకి వర్గం మొ త్తం సిగ్గుపడుతోంది. జయరామ్ ఇప్పటికైనా భాషకు పనిచెప్పకుండా, సంప్రదాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి.

జయరామ్ చేసిన స్కామ్ లకు సంబంధించి 3ప్రశ్నలు అడుగుతున్నాను. బూతులుతిట్టకుండా అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మంత్రికి ఉందా?
1. ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి, తెలుగుదేశం పార్టీ ప్రజలముందు ఉంచిన 250 పేజీల నివేదికలో మంత్రి ఏవిధంగా మందులకొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డాడో స్పష్టం చేసింది. ఫార్మాకంపెనీవారు మంత్రికిఇచ్చిన బెంజ్ కారులో ఆయన కుమారు డు షికార్లుచేస్తున్నాడు. అసెంబ్లీలోనే జయరామ్ ను తాము బెంజిమంత్రి అని పిలిచాము. అప్పుడులేని కోపం జయరామ్ కు ఇప్పడు ఎందుకొచ్చిందో ఆయనే చెప్పాలి. బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతారని పేరు కానీ, జయరామ్ బెంజికారు కు అమ్ముడుపోయాడు. జయరామ్ తండ్రి, తాతలు కార్లలో తిరిగారా?

2. మంత్రి జయరామ్ భూబాగోతం. రూ.45కోట్ల విలువైన 180ఎకరాల భూమిని కేవలం రూ.2కోట్లకే కొట్టేసి బినామీలపేరుతో పెట్టాడు. ఐటీశాఖే ఈ విషయం బయటపెట్టింది. జయరామ్ సతీమణిపేరుతో ఉన్న30ఎకరాల్ని అటాచ్ చేసి,ఐటీ నోటీసులిచ్చింది ని జంకాదా? ఆస్పరి మండలం, చిన్నఊతర గ్రామంలో ఎకరా భూమిధర రూ. 5లక్షలు ఉంది. ఎకరం కేవలం రూ.21,500లకు జయరామ్ 180ఎకరాలు ఎలాకొన్నాడు. భూములు కొన్నడబ్బు మంత్రికి ఎక్కడినుంచి వచ్చింది?
3. మీసాలుతిప్పుతూ, నీతినిజాయితీ అని మంత్రి తొడకొడుతుంటాడు. జగన్ అసెంబ్లీ సాక్షిగా వాల్మీకుల గొంతుకోస్తుంటే, జయరామ్ పక్కనుండి ఆ గొంతులపై నీళ్లుచల్లా డు. 4జిల్లాల్లోని వాల్మీకుల్ని ఎస్టీల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి తీర్మానంచేస్తే, మంత్రి నోరు మెదపలేదు. కారణం ఏమిటి? వాల్మీకులపేరు చెప్పి గెలిచి, మంత్రి అయిన జయరామ్ కు తనవర్గానికి జగన్ చేస్తున్న అన్యాయం కనిపించలేదా? జయరామ్ ను వాల్మీకుల ద్రోహి అనక ఏమనాలి?
చంద్రబాబు రాష్ట్రంలోని వాల్మీకులందరినీ ఎస్టీల్లో చేరుస్తూ జీవోఇస్తే, జగన్ కేవలం 4 జిల్లాల్లోని వాల్మీకులనే ఎస్టీల్లో చేర్చడం ఏమిటి? దానిపై జగన్ ను జయరామ్ ఎందుకు ప్రశ్నించలేదు?
చంద్రబాబుగారు రాష్ట్రంలోని వాల్మీకులందరినీ ఎస్టీల్లో చేరుస్తూ 2017, డిసెంబర్ 2న జీవో ఇచ్చారు. దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్లుగా సత్యపాల్ కమిటీ నివేదికను, కారెంశివాజీ కమిటీ నివేదికను జతచేశారు. ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 16నిమిషాలు దానిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తీర్మానాన్ని ఆయన కేంద్రానికిపంపించి, కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా సమాధానమిచ్చారు.
అదేమీ తెలియనట్టు జగన్ కేవ లం 4జిల్లాల్లోని వాల్మీకులనే ఎస్టీల్లో చేర్చడం ఏమిటి? మంత్రిగా చేసిన కబ్జాలు, అవినీతి కి భయపడే, జయరామ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించడంలేదా? బీసీకోటాలో మంత్రి అయిన జయరామ్ బీసీల పరువుతీస్తున్నాడు. లోకేశ్ పై, చంద్రబాబుపై జయరామ్ నోరు పారేసు కుంటే, దానికిపదింతలు తాము బూతులతోనే సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నా ను.”

లోకేశ్ సవాల్ ను స్వీకరించలేక తోకముడిచిన జయరామ్, కొవ్వెక్కి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. లోకేశ్ ను అనేముందు తన జన్మరహస్యం ఏమిటో జయరామ్ తెలుసుకుంటే మంచిది
– టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్రఅధ్యక్షులు ఎం.ఎస్.రాజు

“గుమ్మనూరు జయరామ్ అవినీతి అక్రమాలు, దుర్మార్గాలని బహిర్గతంచేస్తూ టీడీపీ యువనేత లోకేశ్ సవాల్ విసిరితే, దానిపై స్పందించకుండా, కేవలం నోటికొచ్చినవిధంగా బూతులు మాట్లాడటం మంచిదికాదని మంత్రికి సూచిస్తున్నాం.
జయరామ్ కు ఉన్న భూములెన్ని.. అప్పనంగా కాజేసినవి ఎన్ని? వ్యవసాయంలో లాభపడితే జయరామ్ ప్రభుత్వం నుంచి పంటనష్టపరిహారం ఎందుకు తీసుకున్నాడు?
180 ఎకరాలు రూ.2కోట్లకు ఎలా వచ్చాయో మంత్రి చెప్పాలి. రిజిస్ట్రేషన్ లో అక్రమాలకు పాల్పడి మరీ భూముల్ని తక్కువధరకు కొట్టేసింది నిజంకాదా? తనవద్ద ఉన్నభూముల కు సంబంధించి ఎవరైనా వచ్చి మావి అంటే మార్కెట్ ధరకే వారికి తిరిగిస్తాను అని జయ రామ్ అన్నాడు. దాన్నిగుర్తుచేస్తూ మార్కెట్ ధరను తానిస్తాను.. ఆ భూముల్ని రైతుల కు ఇవ్వండి అని లోకేశ్ అంటే జయరామ్ కు ఉలుకెందుకు? తనభూముల్లో తాను వ్యవ సాయం చేసి లాభపడితే, జయరామ్ ప్రభుత్వం నుంచి పంటనష్టపరిహారం ఎందుకు తీసు కున్నాడు? అసలు ఆయనకున్న భూములెన్ని.. అప్పనంగా కాజేసినవి ఎన్ని?
కర్నూలుజిల్లాలో చాలామంది పేదవాల్మీకులకు ఎకరాభూమిలేదు.. జయరామ్ కు ఇం తభూమి ఎక్కడిదని లోకేశ్ ప్రశ్నించారు. దానికే జయరామ్ ఎగిరెగిరి పడుతున్నాడు.
అతను ఇసుకను అక్రమంగా తరలిస్తూ దోచుకుంటున్నది ఎంత? కర్ణాటక నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముతూ సంపాదిస్తున్నది ఎంత? బియ్యం కుంభకోణంలో కొట్టేసిం ది ఎంత? మంత్రి జయరామ్ రియల్ ఎస్టేట్ దందాలపై కూడా లోకేశ్ మాట్లాడి, సవాల్ చేశారు. లోకేశ్ సవాల్ స్వీకరించకుండా తోకముడిచిన జయరామ్, కొవ్వెక్కి మాట్లాడు తున్నాడు.
లోకేష్ సవాల్ కు స్పందించకుండా, ఆయన్ని బూతులు తిట్టే ముందు తనజన్మరహస్యం ఏమిటో జయరామ్ తెలుసుకుంటే మంచిది

ఈఎస్ఐ విభాగానికి సంబంధించి, మందులకొనుగోళ్లలో జయరామ్ అవినీతికి పాల్పడబట్టే ఫార్మా కంపెనీకి చెందిన కార్తీక్ అనే వ్యక్తి బెంజికారు ఇచ్చాడని తెలుగుదేశం ఎప్పుడో బహిర్గ తం చేసింది. మంత్రి కుటుంబం బెంజికారులో తిరుగుతుంటే పేద వాల్మీకులు పనిలేక అల్లా డుతున్నారని లోకేశ్ అన్నారు. దానికి జయరామ్ మీసాలు తిప్పితే ఇక్కడ భయపడేవాడు ఎవడూలేడు. లోకేశ్ ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జయరామ్ ఇంటిపైకి వెళ్లి, ఆయనకు చెప్పాల్సిన విధంగా సమాధానంచెబుతాం. ఇప్పటికైనా జయరామ్ స్పందించి లోకేశ్ సవాల్ కు స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయానికివస్తే, ఇటినా కంపెనీకి భూములమ్మిన రైతుల్ని తీసుకొస్తాం. అక్కడే మంత్రి వారికి భూముల్ని రిజిస్టర్ చేయాలి. లోకేశ్ ను బూతులు తిట్టే ముందు జయరామ్ తన జన్మరహస్యాన్ని తెలుసుకోవాలి.”

LEAVE A RESPONSE