Suryaa.co.in

Political News

నువ్వు ఉండవల్లి వా? ఊసరవెల్లి వా?

తల్లిదండ్రులు జన్మనిస్తారు.
గురువులు విద్యనిస్తారు.
సమాజం జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆకలి నైపుణ్యాన్నిస్తుంది.

అరాచకం ఆలోచించే అవకాశాన్ని స్తుంది, దుర్మార్గం ప్రశ్నించే అవకాశాన్ని స్తుంది.
నిజాయితీ నువ్వు ఎటువై పో నిర్ణయిస్తుంది. కానీ స్వార్థం, పిరికితనం నిన్ను బానిసను చేస్తుంది.

నాయకుడు 10 మందికి మార్గదర్శి కావాలి. మార్గదర్శిని విమర్శించి నాయకుడు కాకూడదు.

ప్రశ్నించు… కానీ ఆ ప్రశ్న రామోజీరావుతో ఆగిపోకూడదు.
రాజశేఖర్ రెడ్డి కొడుకుని కూడా ప్రశ్నించు. అతని అరాచకాన్ని ప్రశ్నించు. అతని అవినీతిని ప్రశ్నించు. అతని దోపిడీని ప్రశ్నించు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించు. రాక్షస పాలనను ప్రశ్నించు.

అమరావతిని ఆపి నోడిని ప్రశ్నించు. పోలవరాన్ని పడుకోబెట్టిన వాడిని ప్రశ్నించు.

సమాజ హితాన్ని వదిలేసి,
జగన్నాటకంలో…..పగటి వేషాలు వేస్తే…. నిన్ను ప్రశ్నించే వాళ్ళు వస్తారు. సుబ్రహ్మణ్య మైదానంలో నిలబడి….. సూటిగా ప్రశ్నిస్తారు.
ఏమనో తెలుసా?
నువ్వు ఉండవల్లి వా?
ఊసరవెల్లి వా?

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE