– సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ ఎజెండా : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
-బీ ఆర్ ఎస్ కే అవకాశం కల్పించాలి : ఇంచార్జ్ దాసోజు శ్రవణ్
సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగామిస్తోందని, 2014 లో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శకం ఆరంభం అయ్యిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం సితాఫలమండీ లో కోలాహలంగా జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కొత్త పధకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కిందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర పురోభివృద్ది వైపు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. పేదలకు విద్య, వైద్యం, దళితుల సంక్షేమం, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మైనారిటీల అభ్యున్నతి, మహిళా ఆర్ధిక స్వాలంభాన, బీ సీ వర్గాలకు ఉపకరించే పధకాలు తెలంగాణా రాష్ట్రం లోనే సాగుతున్నాయని పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును అవహేళన చేసిన వారికీ సైతం విస్మయం కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దళితుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. పేద దళితులకు భూ పంపిణీ, డబుల బెడ్ రూమ్ ఇళ్ళలో అవకాశం, విద్యకు గురుకులాల ఏర్పాటు, మహాత్మా జ్యోతి రావు పులే ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఇతరత్రా ఉపకార వెతలను వంటి పధకాలను ఏర్పాటు చేసింది. అణగారిన దళిత కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారి స్వలంభానకు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా దళిత బంధు పధకాన్ని ప్రవేశ పెట్టింది.
బ్యాంకు లింకేజి తో నిమిత్తం లేకుండా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లబ్దిదారులకు రూ.10 లక్షలు ఏక మొత్తంలో ఆర్ధిక సహకారాన్ని అందించేలా ఏర్పాట్లు జరిగాయి. 2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో ఈ పధకాన్ని ప్రారంభించి 4 వేల కోట్ల రూపాయలతో 40 వేల దళిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారు. ప్రస్తుత సంవత్సరం 1.75 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా రూ.17,700 కోట్లను బడ్జెట్ లో పొందు పరచారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ చొరవతో నగరంలోనే తొలిసారిగా దళిత బంధు పధకాన్ని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటి కలెక్టర్ శర్మన్ ప్రారంభించారని వివరించారు.
అడ్డగుట్ట, తార్నాక, సీతాఫలమండి, బౌద్దనగర్, మెట్టుగూడ డివిజన్ల నుంచి కలిపి వంద మంది లబ్దిదారులు ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోగా, 65 మంది వాహనాలను కొనుగోలు చేసుకొని తమ కుటుంబాలను పోషించుకోగాలుగు తున్నారు. ఇక తాజాగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పోర్తిని తెలంగాణా ప్రజల్లో నిరంతరం రగిలిన్చేలా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టుకోవడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రిక నిర్ణయాలు గా చెప్పుకోవచ్చున ని వివరించారు.
ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకులా మాత్రమే చూశాయన్నారు. తెలంగాణలో మాత్రమే సర్వమత సామర్స్యం పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కోకాపేటలో రాష్ట్రం ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాలుకు 10 ఎకరాలు కేటాయించిందని, భవన సముదాయం నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 408 మైనారిటీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలు, మరమ్మతులకు రూ.53 కోట్లు గ్రాంట్ మంజూరు చేశామని తెలిపారు.. మసీదుల్లో ఇమాం లు, మోజంలకు నెలసరి గౌరవ వేతనం అందిస్తున్న ప్రభుత్వం మనదే. సికింద్రాబాద్ పరిధిలో మైనారిటీ ల సంక్షేమానికి తాము పెద్ద పీట వేస్తున్నామని ,చిలకలగూడ ఇద్గా ను మోడల్ గా తీర్చి దిద్దామని తెలిపారు.
బీ ఆర్ ఎస్ దే హ్యాట్రిక్ విజయం
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీ ఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో విజయం సాధించిందని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తనదైన్ శైలిలో పరిపాలన దక్షతను చాటుకున్నారని, ఆయన ను అణచివేసేందుకు వివిధ జాతీయ పార్టీ లు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. భాజపా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి సహాయ నిరాకరణను అందిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కెసిఆర్ కు ఆదరణ పెరుగుతోందని, తెలంగాణా ను మరోసారి కెసిఆర్ సర్కార్ రావడం తధ్యమని అన్నారు. ఉద్యమ సమయం నుంచి కెసిఆర్ వెన్నంటే సికింద్రాబాద్ ఏం ఎల్ ఏ పద్మారావు గౌడ్ నిలిచారని, జనాదరణ కలిగిన నేతగా అగ్ర స్థానంలో నిలుస్తున్నారని దసోజు శ్రవణ్ కితాబునిచ్చారు.
అంతకు ముందు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, సునిత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి లతో కలిసి పార్టీ పతకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణా అమర్ వేరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నేతలు మోతే శోభన్ రెడ్డి, లింగాని శ్రీనివాస్, కంది నారాయణ, కరాటే రాజు, సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గరికపోగుల చంద్రశేఖర్ రూపొందించిన సికింద్రాబాద్ ప్రగతి నివేదికను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. ప్రముఖ తెలంగాణ కళాకారుడు కనకరాజు బృందం తమ ఆట పాటలతో సభికులను ఓలలాడించింది.