Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తండ్రి, తల్లి ముసలోళ్లు కారా?

– జగన్ ఎప్పుడూ ఇలానే ఉంటాడా.. ముసలాడు కాడా?
– వయస్సుని గౌరవించలేని సంస్కారహీనుడు జగన్
– మట్టి, గ్రావెల్ అక్రమతవ్వకాలు, రవాణా అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో, మంత్రి అంబటి ఆదేశాలతో జరుగుతున్నదే
– ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయాధికారి ధనుంజయ రెడ్డి, సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్, సీ.ఎఫ్.ఎం.ఎస్. సత్యనారాయణలు రాష్ట్రసంపదను లూఠీచేస్తున్నారు
• పోలవరం కుడికాలువ కేంద్రంగా రూ.870కోట్ల విలువైన 6కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ తవ్వకాలు, రవాణా, అమ్మకాలపై ముఖ్యమంత్రి నోరువిప్పాలి
• కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సాగిస్తున్న మట్టి, గ్రావెల్ అక్రమతవ్వకాలు, అమ్మకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్న సొమ్మెంత? మంత్రి అంబటి, అతని అనుచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్టేస్తున్నది ఎంత?
• మట్టి, గ్రావెల్ మాఫియాపై ప్రశ్నించిన ఐ.ఏ.ఎస్ అధికారుల్ని బెదిరించింది ఎవరు? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం పరిశీలనకు వెళ్లకుండా గోతులుతవ్వి, గేట్లు పెట్టి తాళాలు వేసిందెవరు?
• అక్రమతవ్వకాలకు సంబంధించి జూన్ 22న తమఎదుట హాజరై, వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి తలఎక్కడ పెట్టుకుంటాడు?
• తామిచ్చిన ఆదేశాలు ధిక్కరించి యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు సాగించి వేలకోట్లు దోచేసిన దుర్మార్గుల్ని న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఆంధ్రులజీవనాడి, కోట్లాదిరైతులకు, 50లక్షల ఎకరాలకుసాగునీరు అందించే బహుళార్థ సాథక ప్రాజెక్ట్, 960 మెగావాట్ల విద్యుత్ ను రాష్ట్రానికి అందించే ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబుగారి హాయాంలో 72 శాతానికిపైగా పూర్తిచేస్తే, రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, కమీషన్లకక్కుర్తితో జగన్ సర్వనాశనం చేశాడని, గొప్పప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మా ర్చి, డయాఫ్రమ్ వాల్ ను గోదావరిలో ముంచేశాడని, రెండు, మూడేళ్లలో వచ్చిన వరద ధాటికి పోలవరం నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలు, గుట్టలు ఎక్కాల్సిన దుస్థితి కల్పించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నా రు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే ..

“జగన్ నిర్వాకం, అసమర్థతవల్ల పోలవరం నిర్వాసితులు సర్వంకోల్పోయారు. గతంలో వారువరదల్లో చిక్కుకున్నప్పుడు ముఖ్యమంత్రి చేస్తానన్నవి…ఇస్తానన్నవి ఏవీ అమలుకా లేదు. మరలా జూన్ వస్తున్నా నిర్వాసితుల గురించిన ఆలోచన ముఖ్యమంత్రిచేయడం లే దు. మరోపక్క ఇరిగేషన్ మంత్రి పోలవరం మట్టిని దోచేస్తున్నాడు. ప్రాజెక్ట్ కుడికాలువ పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు గాలికివదిలేస్తే, చంద్రబాబుగారు వచ్చాక రైతులతో మాట్లాడి, కోర్టుకేసుల్నిపరిష్కరించి, పనుల్ని శరవేగంగా జరిపించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీవద్ద గోదావ రి నీళ్లను కృష్ణానదిలో కలిపారు. పోలవరం కుడికాలువ కేంద్రంగా విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలుసాగిస్తున్నది ఎవరో, తన అనుచరుల ప్రమేయంపై మంత్రి అంబటి సమాధానంచెప్పాలి. పోలవరం కుడికాలువలో 6కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ ఉన్నాయి. రూ.870కోట్ల విలు వైన ఆ మట్టిని, గ్రావెల్ ను దోచేశారని చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గత 47 నెల లుగా మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది?

గ్రావెల్, మట్టిదోపిడీకి సం బంధించి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లోని ఒకమహిళా అధికారి (ఏ.ఈ.వో – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) గన్నవరం పోలీస్ స్టేషన్లో 2022లో మంత్రి అనుచరులపై ఫిర్యాదు చేసింది. (ఫిర్యాదు కాపీని ఎఫ్.ఐ.ఆర్-247/2022 దేవినేని ఉమా విలేకరులకు చూపించా రు) ఫిర్యాదుచేసిన సదరు మహిళా అధికారికి బహుమానంగా ఈ ప్రభుత్వం ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకుంది. మంత్రి అనుచరులని చెప్పుకుంటున్న రవితేజ, సునీల్ కుమార్, సంగీత్ లు ఎవరు? మంత్రి అనుచరులతో పాటు, స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేలు పోలవరం కుడికాలువలోని విలువైనమట్టి, గ్రావెల్ ను ఇష్టానుసారం దోచేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గోదావరిజిల్లాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ దోపిడీలో మునిగితేలుతున్నారు. ఈ విధమైన దోపిడీకి ఎవరు అనుమతిచ్చారో, ఎవరి అనుమతితో రాత్రిపగలుతేడాలేకుండా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ దోచేస్తున్నారో ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పాలి. మట్టి, గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ నివేదిక తూతూమంత్రమే. అసలు లోతుల్లోకి వెళ్లకుండా పైపైన పరిశీలించి ఇచ్చిన నివేదిక. సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రి అంబటి పందికొక్కుల్లా మట్టి, గ్రావెల్ బొక్కేస్తుంటే ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు?

మట్టి, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక నామమాత్రమే. లోతుల్లోకి వెళ్లకుండా పైపైన దర్యాప్తుచేసి నివేదిక ఇచ్చారు. అటవీభూములు, అసైన్డ్ భూములు, పోలవరం కుడికాలువ గట్ల తవ్వకాలపై నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీరఘురాం, ఎంపీ నందిగంసురేశ్ అనుచ రులు పోలవరం ప్రాజెక్ట్ మట్టిని, గ్రావెల్ ను దోచేస్తుంటే, ఎవర్ని ఏమంటున్నావు జగన్ రెడ్డి? ఎవరు ముసలాడు జగన్ రెడ్డి? రాష్ట్రాన్ని దోచుకుంటూ, కళ్లుమూసుకుంటున్న నీవు ముస లాడివా.. ప్రజలకు భయపడి పరదాల చాటున దాక్కుంటున్న నువ్వు ముసలాడివా? అంబటి రాంబాబు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పోలవరం మట్టి, గ్రావెల్ దోపిడీద్వారా కొల్లగొట్టినసొమ్ము ఎంతో ముఖ్యమంత్రిచెప్పాలి. వారి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిందెంతో కూడా ప్రజలకు చెప్పాలి. మట్టి, గ్రావెల్ అమ్మకాలపై మంత్రి అంబటి వాటా ఎంత.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వాటా ఎంతో కూడా ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పా లి. మెక్కేశారు… మొక్కలేశారు.. మైనింగ్ అక్రమాలపై నిర్ధారణకు వచ్చిన కమిటీ.. తప్పుదో వ పట్టిస్తారు..తవ్వేస్తారు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రికి సిగ్గుందా? సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రి అంబటి పందికొక్కుల్లా మట్టి, గ్రావెల్ బొక్కేస్తుంటే ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు. వారుచేసిన మట్టి, గ్రావెల్ దోపిడీని తాము డ్రోన్ కెమెరాలతో ప్రజలముందు ఉంచాము. తవ్వకాలకు సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక తూతూమంత్రమే. కొంతవరకే సమాచారాన్ని బయటపెట్టింది.

ప్రభుత్వం మట్టి, గ్రావెల్ తవ్వకాలకు ఎవరికి, ఎంతతవ్వకాలకు అనుమతిచ్చింది.. ఎంత తవ్వకాలుజరిగాయి? ఎవరు రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు?
మట్టి, గ్రావెల్ అక్రమతవ్వకాలు, అధికారపార్టీ దోపిడీపై హైకోర్టు కఠినచర్యలుతీసుకోవాలి. మాజీ సైనికోద్యోగి 2023 మార్చి06న పోలవరం కుడికాలువలో జరిగే మట్టి, గ్రావెల్ తవ్వకా లపై హైకోర్టుని ఆశ్రయించారు. కాలువగట్లు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, దళితుల్ని భయపెట్టి అసైన్డ్ భూముల్లోని మట్టిని తవ్వేస్తున్నారని, గట్లుబలహీనపడితే పోలవరం వరద నీరు గ్రామాలపైపడి వేలాదిమంది ప్రజలభద్రత ప్రశ్నార్థకం కానుందని సదరు సైనికోద్యోగి హైకోర్టుకు విన్నవించారు. దానిపై హైకోర్టు స్పందించి, మట్టి గ్రావెల్ తవ్వకాలు ఆపమని చెప్పినా కూడా వైసీపీదుర్మార్గులు ప్రజల్ని పట్టించుకోకుండా, పర్యావరణాన్ని ఖాతరు చేయకుండా, ప్రాజెక్ట్ రక్షణగురించి ఆలోచించకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు.

కోర్టు ధిక్కరణ కింద మరోసారి కోర్టునిఆశ్రయించినా, న్యాయస్థానం మరలా తీర్పుఇచ్చినా వైసీపీ మట్టి దొంగలు తవ్వకాలు, రవాణాఆపలేదు. ముఖ్యమంత్రి కనుసన్న ల్లో మంత్రి అంబటి ఆదేశాలతోనే పోలవరం కుడికాలువ పరిధిలో మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. సెంటుపట్టా భూముల్ని చదునుచేయడంకోసమనిచెప్పి మట్టితవ్వకాల ముసుగులో వేలకోట్లు కొట్టేశారు. మట్టి, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నిక్యూబిక్ మీటర్లకు అనుమతిచ్చింది? ఎవరికి అనుమ తిచ్చింది?

విజిలెన్స్ నివేదికలో ఉన్న సర్పంచ్ లు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, బినామీల్లో ఎవరికి అనుమతులు ఇచ్చారు. వారు ఎంతమేరకు దోపిడీచేశారనే వివరాల్ని ప్రభుత్వం ప్రజలముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. దోచింది ఎవరు..దాచింది ఎవరో ప్రజలకు తెలియాలి. నిత్యం మట్టి, గ్రావెల్ దోచే స్తూ, తద్వారావచ్చిన సొమ్ముని దాచేస్తున్న మంత్రి అంబటి, ముఖ్యమంత్రి సిగ్గు, ఎగ్గూ లేకుండా ప్రతిపక్షనేతపై, టీడీపీపై విమర్శలుచేస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విచ్చలవిడిగా సాగిస్తున్న గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు, అమ్మకాలపై ముఖ్య మంత్రి ఏంసమాధానం చెబుతారు?

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం పరిశీలనకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? పరిశీలనకు వెళ్లకుండా గోతులు తవ్వి, గేట్లుపెట్టి, వాటికితాళాలు వేసింది ఎవరు?
ఒక్కోలారీలో 100టన్నుల లోడ్ చేస్తున్నారు. మట్టి, గ్రావెల్ లారీలను స్థానికులు అడ్డుకున్నా పోలీస్, మైనింగ్ అధికారులు ఎలాంటిచర్యలు తీసుకోలేదు? స్థానికులు గొడవ చేయడంతో పోలీసులసాయంతో లారీలు పంపించేసి, తరువాత తీరుబడిగా ఘటన స్థలాలకు మైనింగ్ అధికారులువెళ్లడం ఏమిటి? కృష్ణా, గుంటూరు జిల్లాతో పాటు, ఉభయగోదావరి జిల్లాల్లో జరుగుతున్న మట్టి, గ్రావెల్ తవ్వకాల పరిశీలనకువచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ గూండాలు అడ్డుకున్నారు. తవ్వకాలు జరిగే ప్రాంతా నికి ట్రైబ్యునల్ బృందాన్ని వెళ్లకుండా గోతులు తవ్వారు. గేట్లుపెట్టి, వాటికి తాళాలేశారు. ఇంతచేసినా కూడా ఒక మహిళా సబ్ కలెక్టర్ అదితీసింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించింది. ఆమెను అడ్డు కున్నవారిపై ముఖ్యమంత్రి ఎలాంటిచర్యలు తీసుకోలేదు? అటవీభూముల్లో జరిగే అక్రమతవ్వకాలపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతారు? తప్పు అనిచెప్పిన అధికారుల్ని ఎందుకు బెదిరిస్తున్నారు. మరికొందరిని ఎందుకు ఆకస్మికంగా బదిలీ చేస్తున్నా రు? మట్టి అక్రమతవ్వకాలపై విచారణ జరుగుతుంటే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికా రులు ఎందుకువెళ్లలేదు. మాజీసైనికోద్యోగి వేసిన పిటిషన్ పై హైకోర్ట్ కి కూడా ప్రభుత్వాధి కారులు తప్పుడు సమాచారం ఇచ్చారు.

హైకోర్ట్ ఆదేశాలను, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనల్ని ఖాతరుచేయకుండా దోపిడీయే పరమావధిగా, డబ్బే ధ్యేయంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు గిస్తారా?
పోలవరం కుడికాలువ కేంద్రంగా భారీఎత్తున మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతుంటే ముఖ్యమం త్రి స్పందించడా? హైకోర్ట్ ఆదేశాలను, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనల్ని ఖాతరుచేయకుం డా దోపిడీయే పరమావధిగా మట్టి, గ్రావెల్ తవ్వకాలుసాగిస్తారా? రూ.10వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఏపీప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్ట్ లో ఉన్నాయంటే ముఖ్యమంత్రి ఏవిధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడో చెప్పాల్సి న పనిలేదు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి కోర్టులకు భయపడతాడా? అందుకే బరితెగించి ప్రజల్ని వేధిస్తూ, సహజవన రుల్ని కూడా లూఠీచేస్తున్నాడు. గ్రావెల్, మట్టి అక్రమతవ్వకాలు రవాణాపై ముఖ్యమంత్రి ఎవరిపై చర్యలు తీసుకుంటాడో సమాధానం చెప్పాలి. మంత్రి అంబటిని కేబినెట్ నుంచి బర్తర ఫ్ చేస్తాడా? సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను పార్టీ నుంచి పదవులనుంచి తప్పిస్తాడా? పోలవరం కుడికాలువ కేంద్రంగా జరిగే మట్టి, గ్రావెల్ అక్రమతవ్వకాలు, రవాణా ఒక్కసాక్షి మీడియాలో తప్పఅన్నిపత్రికలు, టీవీల్లో వచ్చింది. అయినా ముఖ్యమంత్రిలో చలనం లేదు.

బటన్ నొక్కుడు స్కామ్ లో ముఖ్యమంత్రిజగన్, సజ్జల, ఇతరఅధికారులు త్వరలోనే జైలుపాలు
జగన్మోహన్ రెడ్డి ఒక్కఛాన్స్ అని ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. బటన్ నొక్కుడుపేరుతో నువ్వు బొక్కుతున్నది ఎంతో చెప్పు జగన్ రెడ్డి? బటన్ నొక్కుడు వివరాలను సచివాల యాల వారీగా బయటపెట్టే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ చేస్తున్నాం. బటన్ నొక్కి నేరుగా ప్రజలఖాతాల్లోకి డబ్బులు వేస్తానంటున్న జగన్ మాటలన్నీ మోసపూ రితాలే. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయాధికారి ధనుంజయ రెడ్డి, సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్, సీ.ఎఫ్.ఎం.ఎస్. సత్యనారాయణలు రాష్ట్రసంపదను లూఠీచేస్తున్నారు. బటన్ నొక్కుడు అనే కార్యక్రమం ముసుగులో సచివాల యాలద్వారా వేలకోట్లు బొక్కేశారు. ఎన్నివేలకోట్లు బటన్ బొక్కుడు ద్వారా కాజేశారో వారే చెప్పాలి. బటన్ నొక్కుడు పేరుతో దోచేసినందుకుగాను, వారు ఐదుగురు జైలుకువెళ్లాల్సిన పరిస్థితి రానుంది. జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా ఆ డబ్బు ప్రజలకు రావడంలేదు. రైతుల ఖాతాల్లో నిధులు వేశానన్నాడు.. ఆ సొమ్ముఇంతవరకు రాలేదు. వసతిదీవెన డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలకు చేరదు.

ఢిల్లీవెళ్లి రాష్ట్రసమస్యలపై నోరెత్తలేని జగన్ ముసలాడు.. కేంద్రంనుంచి నిధులురాబట్టుకోలేని జగన్ కంటే పెద్ద ముసలాడు..చేతగాని దద్దమ్మ ఎవరూ ఉండరు. జగన్ రెడ్డి దురాగతాలు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీవెళ్లినా ఎందుకు మీడియాతో మాట్లాడడు? చంద్రబాబుగారు ఎప్పుడు ఢిల్లీవెళ్లినా, ఆయనవెంట రాష్ట్రఅధికారులు ఉండేవారు. ఆయన ఎక్కడ, ఎవరిని కలిసింది, ఏంమాట్లాడిందిస్పష్టంగా మీడియాతో, ప్రజలతో చెప్పేవారు. ఈ ముఖ్యమంత్రిలా చాటుమాటుగా ఢిల్లీవెళ్లి వచ్చేవారుకాదు. జగన్ ఢిల్లీవెళ్లి నోరెత్తలేని నువ్వు ముసలాడివి.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టుకోలేని నీకంటే పెద్దముసలాడు ఎవరూ ఉండరు. చంద్ర బాబు నవయువకుడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చిన నవ యువకుడు. కేంద్రప్రభుత్వం నుంచి నాబార్డ్ ద్వారా పోలవరం నిర్మాణానికి రూ.13,500 కోట్ల నిధులుతెచ్చిన నవయువకుడు చంద్రబాబు. జగన్ తనప్రభుత్వం వచ్చాక పోలవరంలో ఖర్చుపెట్టానంటున్న రూ.2,600కోట్లను కూడా 47నెలలనుంచీ కేంద్రంనుంచి రాబట్టుకోలేక పోయాడు. జగన్ చేతగానిదద్దమ్మ….అసమర్థుడుకాబట్టే రాష్ట్రానికి, ప్రజల సంక్షేమానికి కేం ద్రప్రభుత్వంనుంచి రూపాయి రాబట్టుకోలేకపోయాడు. జగన్ ఎప్పుడూ ఇలానే ఉంటాడా.. ముసలాడు కాడా? ఆయన తండ్రి, తల్లి ముసలోళ్లు కారా? వయస్సుని గౌరవించలేని సంస్కారహీనుడు జగన్. జగన్ కు గతఎన్నికల్లో ప్రజలిచ్చిన 151 సీట్లలో వచ్చేఎన్నికల తర్వాత జగన్ కుమిగిలేది కేవలం 5మాత్రమే. జగన్ టైమ్ అయిపోయింది. మా టైమ్ వస్తుం ది. అది వచ్చాక జగన్ పాపాలన్నీబయటపెడతాం.

హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు సమాధానం ప్రజలే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏకన్ను ఏకన్నుని పొడిచిందో, ఏచెయ్యి ఏచేతిని నరికిందో చెప్పు జగన్ రెడ్డి? కోడికత్రి డ్రామాపై సమాధానంచెప్పు జగన్ రెడ్డి. అమాయకు డు, దళితయువకుడు శ్రీనివాస్ ను జైలుపాలుచేసి, తాడేపల్లిప్యాలెస్ లో ఎన్నాళ్లు దాక్కుం టావు? ఎన్.ఐ.ఏ కోర్టుకిహాజరుకాకుండా ఎన్నాళ్లు కుంటిసాకులు చెబుతావు? నీ కోడికత్తి గాయానికి కుట్లువేసిన డాక్టర్ని ఏపీ హెల్త్ కార్పొరేషన్ ఛైర్మన్ ని చేశావు. బాబాయ్ హత్యకే సులో మరో బాబాయ్ జైల్లో ఉన్నాడు. తమ్ముడు రేపోమాపో వెళ్తాడు. నీ తాడేపల్లి కొంపకు కూడా సీబీఐ నోటీసులు వస్తాయి.. ఎంతవిర్రవీగావు జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి దురాగతాలు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.” అని ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE