Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు

-టీడీపీ క్యాడర్‌పై రౌడీ షీట్లు తెరుస్తున్నారు
– కుప్పం నియోజకవర్గంలో నేడు జరిగిన హింసాత్మక ఘటనలు, టీడీపీ కార్యకర్తపై దాడి అంశంలో డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
– స్థానిక పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు నాయుడు

లేఖలో అంశాలు:-
టీడీపీ నేత వి.బాలకృష్ణ పై, ఆయన ఇంటిపై వైసీపీ గూండాలు రాడ్లు, కర్రలతో నేడు దాడికి పాల్పడ్డారు. బాలకృష్ణ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారు. నియోజకవర్గంలో వైసీపీ కారణంగా హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నేను 1989 నుండి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను… ఇన్నాళ్లూ కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉంది.అధికారంలోకి వచ్చిన తరువాత YSRCP నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో హింసాత్మక చర్యలు మొదలు పెట్టింది. వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.

నిందితులను వదిలి బాధిత టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు…టీడీపీ క్యాడర్‌పై రౌడీ షీట్లు తెరుస్తున్నారు.వైసీపీ గూండాల చర్యల కారణంగానే ప్రశాంతమైన కుప్పంలో 2019 తరువాత హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి అని ఎవరైనా చెప్పగలరు. వైసీపీ హింసను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్దతిలోనే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తునారు.దాడులకు పాల్పడుతున్న వైఎస్సార్‌సీపీ గూండాలను అరెస్టు చేయకుండా కేవలం టీడీపీ క్యాడర్‌పై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే…..కుప్పంలో ప్రజాస్వామ్యం పూర్తిగా బలి అవుతుంది.

టీడీపీ క్యాడర్‌పై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి. నేటి దాడిలో బాధితుడు అయిన బాలకృష్ణను తిరిగి కేసులతో వేధించడం కాకుండా…అతనిపై దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE