కుప్పంను ఉద్ధరించడం అంటే దాడులు, దహనాలేనా?

Spread the love

– వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

పులివెందులకు నేను నీళ్ళు తెచ్చాను. కుప్పంను ఉద్ధరిస్తా అంటున్న నువ్వు ఏం చేసావు? దాడులు, హింసా సంస్కృతిని పెంచి కుప్పం ప్రశాంతతకు నిప్పు పెట్టావు. ఎప్పుడూ లేని విధంగా రౌడీ మూకలు ఇళ్ల మీద పడుతున్నాయి. వాహనాలు తగలబెడుతున్నాయి. నీ దృష్టిలో ఉద్ధరించడం అంటే ఇదేనా? కుప్పం ప్రశాంతత చూస్తే జగన్ రెడ్డికి కడుపుమంట. వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు పోలీసులు, అధికారులు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు? ప్రజల మనసులు గెలవాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి…దాడులు, దహనాలు కాదు!

Leave a Reply