Suryaa.co.in

Features

కార్మికుల సంక్షేమం కాలరాస్తున్న ప్రభుత్వాలు

– కార్మికుల జీవితాల్లో వెలుగునిండేనా ?

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలన కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో ఎన్నో ప్రకరణలు కార్మికుల సంక్షేమం గురించి తెలుపుతున్నాయి. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అంతస్తులో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని పెంపొందించాలి అనే కోణంలో చట్టాల రూపకల్పన చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ప్రాథమిక హక్కులు కార్మికుల సంక్షేమం చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణ భారత భూభాగంలోని ఏ వ్యక్తికీ నిరాకరించారు. పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిరనివాస ప్రాతిపదికన వివక్ష చూపరాదు. సంఘాలు, సంస్థలు స్థాపించుకోవడం, ప్రతి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి, ఉన్నతిని సాధించడానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తగిన సహకారం అందించడానికి, అవసరమైన సంఘాలు, సహకార సంఘాలు, సంస్థలు స్థాపించుకోవచ్చు.

కర్మాగారాలు మొదలైన వాటిలో బాలకార్మిక వ్యవస్థ నిషేధం అని చెప్తున్నా 14 ఏండ్ల లోపు బాలబాలికలకు గనులు, పేలుడు పదార్థాల తయారీ వంటి ప్రమాదకర చోట్ల పని చేయించడం సాధారణమైనది. వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలు, హోదాల్లో అంతరాలు, వివిధ వృత్తులు, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఉన్న ఆర్థిక, పని, ఉద్యోగ అవకాశాల్లోని అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి కానీ ఈ ప్రకరణలు ఎక్కడా అమలు కావడం లేదు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం ప్రభుత్వ విధి కానీ అంతకు విరుద్ధంగా సంపదను కొద్దిమందికి ఇవ్వడంలో ప్రభుత్వం మునిగి ఉంది.

కార్మిక సంక్షేమం అనేది జనాభాను తయారు చేసే పనిలో సింహభాగం పురోగతికి జాతీయ ప్రాజెక్టుల యొక్క నిజమైన భాగాలలో ఒకటి. ‘పని సంక్షేమం’ అనే పదం అనూహ్యంగా అనువర్తించదగినది సుదూరమైనది. కార్మిక సంక్షేమం అనేది సాంఘిక సంక్షేమం యొక్క భాగం, సహేతుకంగా కార్యాచరణ. ఇది విస్తృత క్షేత్రాన్ని కవర్ చేస్తుంది శ్రేయస్సు ఆనందం, నెరవేర్పు, రక్షణ మానవ అభివృద్ధి మెరుగుదల యొక్క స్థితిని సూచిస్తుంది. నిపుణుడి జీవిత పురోగమనం కోసం ప్రభుత్వం వివిధ ప్రమాణాలు నియంత్రణలను రూపొందించింది.

సంక్షేమ రాష్ట్రం యొక్క పరిపూర్ణత పని సంక్షేమ హేతుబద్ధతకు కొత్త కొలతలను జోడించింది. మారుతున్న పరిస్థితి ప్రత్యేక సామర్థ్యాలు, జ్ఞానం మొదలైన వాటికి సంబంధించిన పని కోసం కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటుంది. స్వేచ్ఛా సంస్థ నేపధ్యంలో పారిశ్రామికీకరణ కారణంగా అభివృద్ధి చెందిన సామాజిక సమస్యల దృష్ట్యా ఈ సంక్షేమ విధానం కీలకంగా మారింది. వారి సామాజిక సమస్యకు వ్యతిరేకంగా, వివిధ మెకానికల్ యూనిట్లలోని ప్రతినిధుల ప్రయోజనానికి అనేక సామాజిక సంక్షేమ సౌకర్యాలు కల్పించబడ్డాయి.

ఆధునిక పనిలో ఇటువంటి సంక్షేమ చర్యలకు అవసరమైన దేశాలను సృష్టించడం మరియు అదనంగా సృష్టించడం వంటి విషయాలలో గుర్తింపుపై విస్తృత శ్రద్ధ ఉంది. ఆర్థిక పురోగతి పారిశ్రామికీకరణ కు సంబంధించి పని సంక్షేమం యొక్క ప్రాముఖ్యత క్రమంగా గ్రహించబడింది. వివిధ దేశాలలోని నిపుణులతో పోలిస్తే భారతీయ కార్మికులు చాలా వరకు తక్కువ ఉత్పాదకత కలిగి ఉంటారు. ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు పేద జీవన పరిస్థితుల కారణంగా ఇది వ్యక్తీకరించబడింది. ప్లాంట్‌లలో ఇచ్చిన శ్రేయస్సు భద్రతా చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయి.

పర్యావరణ మార్పులు, అజ్ఞానం, రోజువారీ సౌకర్యాల కోసం తక్కువ నిరీక్షణ వంటివి కూడా ప్రభావాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు, అయినప్పటికీ పేలవమైన పని పరిస్థితులు ప్రాథమిక కారణాలుగా ఉన్నాయి. తయారీ కర్మాగారంలో పని పరిస్థితి నిపుణుల యొక్క విస్తృత ప్రభావానికి ఉపయోగపడదు. అవాంఛనీయ వాతావరణంలో కార్మికులు కష్టపడి పని చేస్తున్నారు. ఇన్ని చట్టాలు వచ్చినా కార్మికుల సంక్షేమం అందని ద్రాక్షగా ఉంది. తొంభయ్ ఐదు శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. రవాణా రంగం, వ్యవసాయ రంగం, పెట్రోల్ బంకులు, లెత్ టింకరింగ్ వెల్డింగ్ ప్లంబింగ్ ఎలెక్ట్రిషియన్, మోటార్ మెకానిక్లకు కార్మిక చట్టాలు పనిగంటలు వర్తించవు.

భద్రతా చర్యలు అసంపూర్తిగా ఉంటున్నాయి.రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనది, రవాణా మౌలిక సదుపాయాలు దేశం యొక్క పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది రవాణా రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత జిగుప్సాకరంగా ఉంది. ప్రతి టోల్ గేట్లో రవాణా బండి వెళ్లాలంటే కనీసం మూడు వందల తక్కువ కాకుండా రుసుము ఉంటుంది. దేశంలో కోటి వాహనాలు వెళుతున్నాయి మరి ఎక్కడా డ్రైవర్ క్లినర్లకు దప్పిక అయితే కనీసం గుక్కెడు నీళ్లు ఇచ్చే టోల్ ప్లాజా లు లేవు.

రవాణా రంగంలోని కార్మికుడు జీవితమంతా గుట్కా, ఖైనీ, పాన్ పరాగ్, బీడీ, సిగరెట్ తో పొగచూరి పోయింది. వీరు ప్రమాదాల బారిన పడి అంగవైకల్యం లేదా ప్రాణం పోతే ఇన్సూరెన్స్, కాంపెన్సేషన్ కోసం సంవత్సరాలు ఎదురు చూడాలి. చాలా మంది సంస్థలలో ఆధునిక లాభదాయకతను తీసుకురావడంలో లేబర్ కీలక పాత్ర పోషిస్తుంది. వర్క్ డ్రైవ్ సంతృప్తికరంగా అర్హత, సిద్ధం ప్రేరణ పొందని అవకాశం ఉన్నట్లయితే, యాంత్రిక లాభదాయకతను మెరుగుపరచడానికి స్వీకరించిన ప్రతి సాధనం ప్రయోజనం లేకుండా ఉంటుంది. ఆర్థిక స్థోమత పరిమితులకు లోబడి పనిచేసే హక్కు, విద్య నేర్చుకొనే హక్కు కల్పించాలి. నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు, అణగారిన వర్గాలకు సహాయాన్ని అందించాలి. ప్రజలకు పనిచేసే, ప్రభుత్వ సహాయాన్ని పొందే హక్కు కల్పించడం. స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు అందించడం.

కార్మికులకు పని చేసే ప్రదేశాల్లో, పనులను చేయించటంలో న్యాయ, ధర్మబద్ధమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి.కార్మికులకు కనీస జీవన వేతనం కార్మికుల జీవన ప్రమాణానికి సరిపోయే వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి. కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం. సహకార సంఘాలను ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాన్ని 2011లో పొందుపర్చారు. సమాన పనికి సమాన వేతనం అనేది రాజ్యాంగ లక్ష్యం అని సుప్రీంకోర్టు పేర్కొంది. శాశ్వత ఉద్యోగులను తొలగించడానికి కారణాలను తెలుపకుండా మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి లేదా బదులుగా నోటీసు కాలపరిధికి జీతం చెల్లించి తొలగించడాన్ని ప్రజా విధానానికి వ్యతిరేకంగా రైట్ టు హియర్ నిరాకరించిందని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.

రవాణా రంగ కార్మికులకు ప్రతి ఇరవై హేను కిలోమీటర్లకు జనతా క్యాంటిన్లో టీ, కాఫీ, మంచినీరు, మజ్జిగ, లస్సి, బిస్కెట్, బ్రెడ్ బేకరీ ఐటమ్స్ అందుబాటులో ఉండాలి. క్యాంటిన్లు సహకార సంస్థ ద్వారా లేదా నిరుద్యోగులకు ఉపాధి పెంచే విధంగా ఎవరు ముందుకు రాని పక్షంలో ధార్మిక స్వచ్చంధ సంస్థలకు ఇస్తే మంచిది. అలాగే టీ, కాపీ తినుబండారాలు ధరల పట్టిక లేకుండా అధిక రేట్లకు అమ్ముతున్నా పట్టించుకునే వారు లేరు.

డ్రైవర్లకు మంచి ఆరోగ్య అలవాట్లు నేర్పితే మంచిది. డ్రైవర్ల యొక్క సంక్షేమం కొరకు నిధిని ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన డ్రైవర్ మరియు క్లినర్ కుటుంబాలకు సత్వరమే పింఛను వచ్చేట్లు చట్టం తేవాలి. బస్తి మొహల్లా, గడప గడపకు డాక్టర్లను పంపుతున్న ప్రభుత్వాలు డ్రైవర్ క్లినర్ లకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి సుఖవ్యాధులు, చెడు అలవాట్లు, సంక్రమిత వ్యాధులు, అంటురోగాలపై అప్రమత్తత చేస్తే కొంతమేరకు వారికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

 

LEAVE A RESPONSE