ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్రనేత
తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం ఉద్యమం చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారు. మీ ఆకాంక్షలు నెరవేరాలనే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కానీ తేలంగాణను టీఆరెస్ ప్రభుత్వం తమ జాగీరుగా భావిస్తోంది. తాము జాగీర్దారులమని టీఆరెస్ నేతలు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయరు.. కానీ ప్రయివేటు యూనివర్సిటీలకు వెంటనే అనుమతులు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేసిన పనులను పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటున్నారు. సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం. బైబై మోదీ.. బైబై కేసీఆర్