-ఉద్యోగుల ఆవేదన
పాత జిల్లాల్లో మేము 16% తీసుకుంటున్నాం. కొత్త జిల్లాకు వచ్చిన అనంతరం 4 శాతం తగ్గించి జిల్లాల విభజన అనంతరం 12 శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది. జిల్లాల విభజన అనంతరం కొత్త జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులకు హెచ్ఆర్ఏ తగ్గింపుతో తీవ్ర నష్టం జరిగింది. జూన్ 2022 నుండి 12 శాతంగా మార్పు చేయడం వల్ల సుమారు 12 నెలల కాలానికి ఆఫీస్ సబార్డినేట్ స్థాయి ఉద్యోగి సుమారు 20 వేల రూపాయలు పైబడి, మిగతా ఉద్యోగులు 25 వేల నుండి 45 వేల రూపాయలు వరకు నష్టపోవడం జరిగింది. ఇప్పటికైనా ఉద్యోగులపై దయవుంచి 16 శాతానికి పెంచడం సంతోషించతగిన విషయం…ఉన్నదే ఇప్పుడు ఇచ్చారు క్రొత్తగా ఇచ్చింది ఏమీలేదని పెదవి విరుస్తున్నారు ఉద్యోగులు…ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.