– గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్
అకాల వర్షాలతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు బయలుదేరగానే నిమ్మకు నీరెత్తినట్లుగా వైసీపీ నేతలు కూర్చువడం చూస్తుంటే విడ్డురంగా ఉంది.అధికారులు మాత్రం తూతూ మంత్రంగా హడావిడి చేసి చేతులు దులుపుకొన్నారు. ముఖ్యమంత్రి మాత్రం దెబ్బతిన్న పంటను పూర్తిగా కొంటామని హామీలు గుప్పిస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతులవద్దకు వెళ్లి వారిపై విరుచుకు పడటం చూస్తుంటే బాధకలుగుతుంది.దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ఎలా కొనాలనే అంశం ఇంతవరకు అధికారులు ఎలా చేయాలో ఆదేశాలు లేకపోవడం గమనార్హం.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఈ నెల12న ముఖ్యమంత్రి ఇంటివద్దకు దెబ్బతిన్న పంటను తీసుకొని వెళ్లి ధర్నా నిర్వహించడానికి టీడీపీ పిలుపును ప్రతి రైతు అందుకొని ధర్నా విజయవంతం చేయాలని కోరారు.
మంత్రి బొత్స గతంలో అమరావతి రాజధాని వర్షాలు వరదలతో మునిగి పోతుందని అసత్య ప్రచారాలు చేశారు. కళ్ళుంది చూడలేని కబోద మంత్రి సత్యనారాయణ రాజధాని రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలనిడిమాండ్ చేశారు.రాజధానిలో పేదలకు సేంట్ భూమి ఇచ్చిపేదలను అడుకొంటామని అభూత కల్పనలు సృష్టించి పేదలను మరోసారి మోసం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
అమరావతి రైతులు ఉద్యమాన్ని చేస్తున్నారని వారిని రైతులు కాదని ఎందుకు హింసలు పెడుతున్నారు… మీ అసత్య ఆరోపణలు పేదలు నమ్మే స్థితిలో లేరన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ రాజధాని అని ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి పేదలకు అమరావతిలో ఇళ్లస్థలల ఇస్తే ఇక్కడ పేదల దగ్గర నీవు పరిపాలన చేయడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నియమనిభందనల ప్రకారం2సెంట్ల భూమి ఉంటే మాత్రమే ఇళ్ళుకట్టుకొనే పరిస్థితి ఉంది.