-నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయం
-రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా
-నియోజకవర్గంలోని 20వేల మంది మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తా
-కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల వల్లే ప్రజలపై పెను భారం
-70 ఏండ్లు పాలించిన పార్టీలు అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఇంత చేయాల్సి వచ్చేదా?
-పొన్నాల లక్ష్మయ్య పొంకనాలే తప్ప ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు
-కెసిఆర్ ను కాపాడుకుంటే… మనకు లాభం జరుగుతుంది
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం, అప్పిరెడ్డి పల్లె గ్రామాలకు కలిపి పడమటి తండాలో, సింగరాజు పల్లె, నీర్మాల గ్రామాలకు కలిపి సింగరాజు పల్లె తుమ్మ గార్డెన్ లో వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గపు గడ్డ…! దయన్న అడ్డా!!… నా నియోజకవర్గాన్ని, నా ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతా. ప్రజలకు తలవంపులు తెచ్చే పనులేమీ చేయను. నియోజకవర్గంలోని 20వేల మంది మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల వల్లే ప్రజలపై పెను భారం పడుతున్నది. 70 ఏండ్లు పాలించిన పార్టీలు అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఇంత చేయాల్సి వచ్చేదా? వాళ్ళు పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో చేయలేని పనులను ఇక్కడ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. అలాంటి వాళ్ళను నమ్మతితే నట్టేట మునిగినట్లే. పొన్నాల లక్ష్మయ్య పొంకనాలే తప్ప మంత్రిగా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. కెసిఆర్ ను కాపాడుకుంటే… మనల్ని కెసిఆర్ కాపాడుతాడు. మనకు లాభం జరుగుతుంది. అన్ని సందర్భాల్లో మనం కెసిఆర్ కు అండగా నిలుద్దాం. మన రాష్ట్రాన్ని, మనకు రాష్ట్రాన్ని తెచ్చిన నేతను కడుపులో పెట్టుకుని కాపాడుకుందాం అని మంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం, అప్పిరెడ్డి పల్లె గ్రామాలకు కలిపి చౌడూరు లో, సింగరాజు పల్లె, నీర్మాల గ్రామాలకు కలిపి సింగరాజు పల్లె తుమ్మ గార్డెన్ లో వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు నన్ను మీ బిడ్డగా ఎన్నుకున్నారు. వేర్వేరు పార్టీల గాలిలో కూడా నన్ను చూసి గెలిపించారు. మీరు చూపిన ఆదరణను మరచిపోలేను. మీ రుణం తీర్చుకునే విధంగా మీ, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నాను. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిపాను. రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాను. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేస్తున్నాను. అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుస్తున్నాను. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలిపారు.
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.500 లకు మించి ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా? రూ.2వేలకు మించి రైతు బంధు తరహాలో పెట్టుబడి కి నిధులు ఇస్తున్నారా? ఆలోచించుకోవాలని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని విధానాలు, తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల కోసం, ఓట్ల కోసం అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి మండి పడ్డారు. 7 గంటల కంరెటుకే దిక్కులేదు… ఇవ్వాళ తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు మిగిస్తామని కేంద్రం చెబితే తన బొండిగలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టేది లేదన్న మహానుభావుడు కెసిఆర్ అన్నారు. ఏడాదికి 10వేల 500 కోట్ల రూపాయలను రైతుల తరపున విద్యుత్ సంస్థకు కట్టి, ఉచిత కరెంటు ఇస్తున్నారని మంత్రి వివరించారు.
బిజెపి అధికారంలోకి రాగానే రూ.200 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, రూ.1200 చేశారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి, అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు కారకులై నేడు ప్రజలపై పెను భారం మోపారని మంత్రి అన్నారు. ఇప్పుడే వీళ్ళే తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆరోపించారు.
సిఎం కెసిఆర్ కు జనమంతా అండగా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలన అద్భుతంగా సాగుతున్నది. రాష్ట్రం సుభిక్షంగా మారింది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మన పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగ మారాయి. ఈ దశలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కొంత ఉన్నప్పటికీ, ఇంత గొప్పగా గతంలో పరిపాలన సాగలేదు. అందుకే ప్రజలంతా సిఎం కెసిఆర్ కు అండగా నిలవాలని, పార్టీ శ్రేణులు ఇందుకు సహకారంగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
అంతకుముందు సమ్మేళనంలో సిఎం కెసిఆర్ సందేశాన్ని వినిపించారు. ఆత్మీయ సమ్మేళనాల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్రమేనని, తాను కూడా కార్యకర్తలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి భోజనాలు చేశారు. వారికి వడ్డించారు. అందరినీ పలకరిస్తూ, కుశల ప్రశ్నలు వేస్తూ మంత్రి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.