– సర్ పేరుతో పేదలు, మైనార్టీల ఓటు హక్కు ను తొలగించే ప్రయత్నం
– దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుంది?
– ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం
– ములుగు లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ ని ఆహ్వానిస్తాం
– గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులు. చట్ట సభల్లో బలం ఉందని మోదీ ప్రభుత్వం పేదల ను ఇబ్బంది పెడుతోంది. వెట్టి చాకిరి నిర్మూలించి,దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి,ఓటు హక్కు ఇచ్చింది మహాత్మా గాంధీ,అంబేద్కర్. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసింది.
400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తం గా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. అదానీ, అంబానీ కి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. ఓటు ప్రక్షాళన పేరు సర్ అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.
సర్ పేరుతో పేదలు, మైనార్టీల ఓటు హక్కు ను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. పేదలకు ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతాయి. దేశంలో ఉండాలా లేదా అన్నది బీజేపీ చేతిలో ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర ఉంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తో పేదల ఆత్మగౌరవం పెరిగింది. ఉపాధి హామీ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయి. అంబానీ, అదానీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించడానికే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారు. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీల కుట్ర ఉంది.
గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ప్రధాని మోదీ తీసుకువచ్చారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ నాడు రాహుల్ గాంధీ కొట్లాడారు. దేశ రైతులకు మోదీ క్షమాపణ చెప్పి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం లో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పేరులోనే గందరగోళం ఉంది.దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుంది?
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తాం. దేశానికి ఈ విషయంలో మోదీ తో క్షమాపణలు చెప్పిస్తాం. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలి.
ప్రతి మండలానికి ఒక ఇంచార్జీ ని నియమించాలని.. నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా. ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ములుగు లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ ని ఆహ్వానిస్తాం.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలి.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాం..ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీ కాదు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తా.
కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ముఖ్యమంత్రి అయ్యాను. కాంగ్రెస్ పార్గీ కి తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడింది. దేశం ఇబ్బందుల్లో ఉంది.. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం తెలంగాణ అండగా ఉంటుంది. మోదీని ఓడించి రాహుల్ ను ప్రధాని చేయడం కోసం అంతా కష్టపడి పని చేయాలి.