– దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో 1988 ఒలంపిక్స్ క్రీడల సందర్భంగా నిర్మించిన క్రీడా మైదానాలను రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలన
– భవిష్యత్తు లో ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు మన దేశానికి అవకాశం వస్తే నిర్వహించే సత్తా తెలంగాణ రాష్ట్రానికే ఉంది
– భవిష్యత్తులో దేశానికి అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించే అవకాశం వస్తే రాష్ట్రంలో నిర్వహించేందుకు క్రీడా మైదానాలను సిద్ధం చేస్తున్నాం
– భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే క్రీడ మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తాం
– సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నాం
– రాష్ట్రం నుండి దేశానికి ఎక్కువ మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యం
– దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం
-ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం క్రీడాలలో పోటి పడబోతుంది
– ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించాం
-ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నాం
-అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను నిర్వహించడానికి క్రీడా మైదానాలను ముందస్తుగా పరిశీలన.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాం
ఉమ్మడి రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు పేరుతో షామీర్ పెట్ లో 230 ఎకరాల భూమి లీజుకు తీసుకున్న ఆ భూములను లీజుల నిబంధనలు పాటించకుండా ఉన్నా సంస్థపై CM KCR ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేసి లీజును రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నాం.
1988 ఒలంపిక్స్ క్రీడలలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నిర్మించిన క్రీడా మైదానాలను రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అధ్యయనం లో వెల్లడి.
రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 1988లో ఒలంపిక్స్ క్రీడల సందర్భంగా నిర్మించిన క్రీడా మైదానాలను అధ్యయనం చేశారు. భవిష్యత్ లో ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు భారతదేశం నిర్వహించే అవకాశం వస్తే తెలంగాణ లో నిర్వహించేందుకు ముందస్తుగా క్రీడా ప్రాంగణాలను సిద్దం చేస్తున్నామన్నారు.
CM KCR ఆదేశాల మేరకు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడ మైదానాలను నిర్మించామన్నారు.
అలాగే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో నిర్మించే క్రీడా మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు.
క్రీడా పతకాలు సాధించడంలో ఇతర దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు . తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ నీ అమలు చేయబోతున్నామన్నారు. CM KCR గారి ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని క్రీడారంగంలో దేశం లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఇప్పటికే కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ , ఖమ్మం లాంటి పట్టణాలలో అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి పథకాలు సాధించిన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులతో పాటు ఇంటి స్థలాలు కేటాయించిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు గోల్ఫ్ కోర్టు పేరుతో షామీర్ పేట లో 230 ఎకరాల భూమిని లీజు కు తీసుకొని ఇతర అవసరాలకు వాడుకొనడంతో CM KCR గారి ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేసి ఆ సంస్ధ లీజు ను రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
ఇటీవల దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కప్ క్రీడలను ఘనంగా నిర్వహించామన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ నీ అమలు చేయబోతున్నామనీ దక్షిణ కొరియా పర్యటనలో క్రీడా మైదానాలను అధ్యయనంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ పర్యటనలో తెలంగాణ పర్యాటక శాఖ ఎండి మనోహర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ లు పాల్గొన్నారు.