Suryaa.co.in

Andhra Pradesh

వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం

వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టం.. ఎమ్మెల్యే అమిలినేని

మహర్షి శ్రీ వాల్మీకి భగవానుడి జయంతి వేడుకల్లో ఇంత మంది వాల్మీకి సోదర సోదరీమణులు మధ్య పాల్గొనడం నా అదృష్టంగా బావిస్తున్నాని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. వాల్మీకి సోదరులతో కలసి వాల్మీకి కూడలిని మరింత అభివృద్ధి చేసి చక్కని ఆహ్లాదకరమైన సర్కిల్ గా తీర్చిదిద్దుతామని, అలాగే వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం వాల్మీకి సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.. అనంతరం వాల్మీకి సీనియర్ నాయకులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘన సన్మానం చేయడం జరిగింది..

ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని నిర్వహిస్తుండటంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కార్యాలయం ప్రజావేదికలో టీడీపీ సీనియర్ నాయకులు, వాల్మీకి సోదరులతో కలసి మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

LEAVE A RESPONSE