Suryaa.co.in

Andhra Pradesh

కళావేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట పట్టణంలో జి.వి.జే జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు శ్రీ పూర్ణానంద బాదే సత్యనారాయణ, వీరమ్మల పేరున కళావేదికను వీరి కుమారుడు బాదే నాగేశ్వరరావు, రత్నమాల దంపతులచే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు కళావేదిక ప్రారంభోత్సవ మహోత్సవంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

కళావేదిక దాత బాదే నాగేశ్వరావు దంపతులను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సన్మానించారు. అనంతరం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, మైనేని రాధాకృష్ణ, గింజుపల్లి వెంకట్రావు, పితాని శ్రీనాథ్ మరియు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE