ఇంట్లోనే.. కన్న తండ్రి, పెంపుడు తండ్రి, మేనమావ, వీధిలోకి వస్తే మానవ మృగాలు, మాటేసి చిన్నారుల మీద చేసే అకృత్యాలు నిత్యం చూస్తున్నాం సమాజంలో. స్కూలు లేదా కాలేజీకి వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చే వరకు మాత్రమే కాదు, ఇంట్లో ఒంటరిగా అమ్మాయిని విడిచి వస్తే కూడా.. ఓ తల్లి బిక్కు బిక్కుమంటూ ఉంటుంది. ఆత్మరక్షణే ఆత్మగౌరవం – ఆంధ్ర ఆడపిల్లల కొత్త గర్జన! నేను నా ఝాన్సీని ఇవ్వను అన్న రాణీ లక్ష్మీభాయ్ సింహగర్జనకు ఆంగ్లేయ సామ్రాజ్యమే అదిరిపోయింది.
ఆమె పేరున ఆత్మ రక్షణ శిక్షణ మొదలైంది ఆంధ్రాలో. మంత్రి లోకేశ్ గత జగన్ ప్రభుత్వంలోలా.. మావయ్య అని పిలిపించుకునే ప్రచారాలకు దిగడం లేదు. మావయ్య మాయలు కాదు, ఆత్మరక్షణ శిక్షణే నిజమైన బంధం అని అన్నగా నమ్మాడు. దాడి చేస్తే దుర్గమ్మల లెక్కన క్షణాల్లో పాదాల దగ్గర మూలిగేలా సరస్వతీ నిలయాల్లో మన ఆడపిల్లలు రాటుదేలేలా తీర్చి దిద్దుతున్నారు. గర్వంగా చూస్తున్నాడు వారి ఆత్మరక్షణ ప్రదర్శనను చంద్రబాబు. పార్వతీపురం మెగా పీటీఎం సందర్భంగా చూస్తున్న తల్లిదండ్రులు తమ సరస్వతులకు దుర్గా రూపంలో చూస్తూ ఆశ్చర్యపోయారు.

