Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌పై చీటింగ్ కేసు నమోదు

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాలిప్పిస్తానంటూ కరీముల్లా షేక్ అమీన్ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.. కరీముల్లాపై నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ ఖాన్ (Abdul Hussain Khan) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌పై 420 ఐపీసీ కింద కేసు నమోదు అయ్యింది. గిడ్డంగుల సంస్థలో అటెండర్ ఉద్యోగమిప్పిస్తానంటూ అబ్బుల్ హుస్సేన్ నుంచి కరీముల్లా రూ.3.80 లక్షలు వసూలు చేశాడు. గత సంవత్సరం డిసెంబరు 31న కరీముల్లా షేక్ అమీన్‌ కు చెందిన అకౌంట్లో అబ్దుల్ హుస్సేన్ డబ్బులు డిపాజిట్ చేశాడు. అనంతరం ఆరు నెలలుగా ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలిప్పిస్తానంటూ తన చుట్టూ తిప్పుకున్న కరీముల్లా షేక్ అమీన్… ఉద్యోగం చూపించకపోగా బెదరింపులకు గురిచేయడంతో అబ్దుల్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

LEAVE A RESPONSE