Suryaa.co.in

Telangana

గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర

-గురుకులాలను ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా ?
-పాలమాకుల లో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారు
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. పేద పిల్లలు చనిపోతే సర్కార్ కు పట్టింపే లేదు. పాలమాకుల లో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారు. సీఎం స్పందించాలి..గురుకులాల పై రివ్యూ చేయాలి
గురుకులాల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదు.

కేసీఆర్ పాలనలో గురుకులాలని దేశంలో గొప్పగా తీర్చిదిద్దారు. మన గురుకులాల్లో లక్షల మంది పిల్లలు సీట్లకోసం పోటీపడుతున్నారు. మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని విధంగా 1022 గురుకులాలు ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో గురుకులాలను చూస్తే ఆనందం వేసేది.

కాంగ్రెస్ పాలనలో గురుకులాలను సర్వనాశనం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కో విద్యార్దిపై 1లక్షా 25 వేలు ఖర్చు చేసేవారము. సీఎం రేవంత్ రెడ్డి బడాయి మాటలు చెప్పుడు తప్పా.. చేతలు చేయడం లేదు. తెలంగాణ ఏ ఒక్క వ్యవస్థ సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానం వస్తుంది. గురుకులాలను ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా చెప్పాలి. దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.

LEAVE A RESPONSE