Suryaa.co.in

Features

సంచార తెగల విద్యార్థులకు సొంతిల్లు ఇచ్చేసిన దంపతులు

శతాబ్దాలుగా స్థిర నివాసం అన్నది లేకుండా తోలు బొమ్మలాట వంటి పలు కళల ద్వారా సనాతన ధర్మ ప్రచారం చేస్తున్న వారు సంచార తెగల ప్రజలు DNT (De-notified Tribes). దేశ రక్షణ కొరకు బలిదానాలు చేసిన వారు DNT తెగల ప్రజలు. వీరి జనాభా సుమారు 12 కోట్లు ఉంటుంది. స్వతంత్ర భారతంలో వీరి అభివృద్ధిని భారత రాజ్యాంగం ద్వారా ఎవరూ పట్టించుకోలేదు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దాదా ఇదాటే కమిషన్ నివేదిక మేరకు మహారాష్ట్రలో వీరికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో DNT, సంచార తెగల అభివృద్ధి మండలి జాతీయ స్థాయిలో ఏర్పడింది.

సామాజిక సమరసత వేదిక, ఆర్ఎస్ఎస్‌ల సహాయంతో 1992లో మహారాష్ట్రలో ఈ ప్రజల కొరకు ఆవాస పాఠశాల ప్రారంభం అయింది. మూడు సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో కూడా సేవాభారతి సహకారంతో ఒక ఆవాసం ప్రారంభం అయింది.
తాజాగా ఆర్థికంగా సామాన్యులు, బలహీన వర్గాలకు చెందినవారు అయిన లావణ్య, కిషోర్ దంపతులు జీవితాంతం కూడబెట్టిన డబ్బుతో తాము ఉండటానికి కట్టుకున్న భవనాన్ని సంచార తెగల విద్యార్థుల వసతి కోసం ఇచ్చేశారు. ఇది ఎంతో ఆశ్చర్యం!

పేద ప్రజల పేరున డబ్బు దోచుకునే వారు, పదవులు సంపాదించుకుని ఈ పేద ప్రజలనే పట్టించుకోని వారు దేశంలో కోల్లలుగా ఉన్న సమయంలో లావణ్య, కిషోర్ దంపతులు ఈ సమర్పణ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

ఇటీవల జరిగిన సంచార తెగల జాతీయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాతీయ నాయకులు సన్మానం చేశారు. సన్మాన చిత్రం,వారు సమర్పించిన భవన చిత్రం చూడవచ్చు.

సౌజన్యం: శ్యాం ప్రసాద్

LEAVE A RESPONSE