ఈరోజు…..
హింసే పెట్టుబడిగా ఎదిగినోళ్ళు…
అహింస గురించి
మాట్లాడే రోజు.
ఈరోజు……
మద్యంతో ప్రభుత్వాన్ని నడుపుతూ…
మద్యపాన నిషేధం గురించి… నిస్సిగ్గుగా మాట్లాడే రోజు.
ఈరోజు….
విలువలు లేని వాళ్లంతా…
విలువల గురించి, విశ్వసనీయత గురించి…
గొర్రెలకు
బోధించే రోజు.
ఈరోజు….
గోముఖ వ్యాఘ్రాలు..
గోశాలలో…
ఫోటోలు దిగే రోజు.
ఈ రోజు….
చదువు లేనోడిని
గద్దెక్కించిన…
చదువు చెప్పే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు…
రోడ్లపై ధర్నాలు చేసే రోజు.
ఈరోజు….
బ్రహ్మాస్త్రం లాంటి ఓటును…
అమ్ముకున్న అయ్యవార్లు…
నమ్ముకున్న నాయకుడే…
నయా జీతాలు ఇస్తానంటే…
నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి
సమాజం సానుభూతి అడుక్కుంటున్న రోజు.
చదువుకున్నొడే… ఈ వ్యవస్థకు పట్టిన బూజు.