– చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బిజెపి కుట్ర ఉందనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న మంత్రులు సత్తిబాబు, పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ ఒకరు…
-ముఖ్యమంత్రి కూడా అదే అర్థం వచ్చేలా ఈ డి, ఐటీ సంస్థ లు కేంద్ర పరిధిలోనివేనని అనడమే కాకుండా, నేను లండన్ లో ఉండగానే చంద్రబాబు నాయుడు అరెస్టు చేశారంటూ కొత్త రాగం
– కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ శుభ సూచకం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురేందరేశ్వరి పై సజ్జల మళ్లీ కారు కూతలు కూస్తారేమో?!
-మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు ఎందుకు?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై గతంలోని తీర్పులను అనుసరించే సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి న్యాయమైన తీర్పు వస్తుందని ఊహించుకోవచ్చునని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు వైపు న్యాయం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎప్పుడు తీర్పును వెలువరించిన ఆయనకు ఉపశమనం లభించడం ఖాయమని తెలిపారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కానీ సోమవారం నాడు వెలువరించే తీర్పుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గతంలో కేసు విచారణ జరిగిన ప్పటికీ , ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పటి నుంచే కేసు పరిగణలోకి తీసుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. లేని చట్టాల కింద చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారని న్యాయమూర్తులే వారి మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన కేసులో కచ్చితంగా అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన వర్తిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
అమిత్ షా తో నారా లోకేష్ భేటీ… కలవరానికి గురవుతున్న మా పార్టీ నేతలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం కావడం, మా పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమిత్ షా, లోకేష్ మధ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా సోషల్ మీడియాలో మా పార్టీ నేతలు పోస్టులను పెడుతున్నారు. పురందరేశ్వరి చొరవ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లయితే, సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొంటారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
ఒకే సమయంలో కిషన్ రెడ్డి, పురందరేశ్వరి, లోకేష్ లు సమయం అడిగి ఉంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సమయాభావం వల్ల అమిత్ షా వారితో సమావేశమై సమస్యలను తెలుసుకొని ఉంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కేంద్రం కుట్ర ఉందనే విధంగా మంత్రులు సత్తిబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
కేంద్ర పరిధిలోనే ఈడి, ఐటీ శాఖలు ఉంటాయని, నేను లండన్ లో ఉండగా చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్టు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం పరిశీలిస్తే… అరెస్టు వెనుక కేంద్రం కుట్ర ఉందని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బిజెపి నాయకత్వం, కేంద్రంపై నీలాప నిందలు వేసే విధంగా మా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా, రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను ఆరా తీసి ఉంటారన్నారు.
తెలంగాణ లోను చంద్రబాబు నాయుడుకు అభిమానులు ఉన్నారు
చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన నాయకుడు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తరహాలోనే చంద్రబాబు నాయుడు కూడా బీసీ నాయకత్వాన్ని ఎంతో ప్రోత్సహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన కుమారుడికి ఎన్టీ రామారావు పేరు కలిసి వచ్చే విధంగా తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు.
అమిత్ షా తో నారా లోకేష్ భేటీ అనంతరం మా పార్టీకి చెందిన పదిమంది సోషల్ మీడియా పెయిడ్ వర్కర్స్ కంగారు పడుతున్నారు. ఈ సమావేశం వారికి శరాఘతం లాంటి వార్త.. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పురందరేశ్వరిపై మరిన్ని కారు కూతలు కూస్తారేమో చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటికైనా వాచాలత ఆపకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కష్టం వచ్చినప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి కలిసి చెప్పుకోవడం తప్పులేదు.
నాపై అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేసినప్పుడు, నా కుటుంబ సభ్యులకు కూడా అమిత్ షాను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యాదృచ్ఛికమో, దైవానుగ్రహమో అమిత్ షా ను మా కుటుంబ సభ్యులు కలిసిన అనంతరం నేను బయటపడ్డాను. చంద్రబాబు నాయుడు వైపు న్యాయం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ప్రకారం ఆయనకు సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఏ ఆధారం లేకుండానే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న దుష్టులకు దూరంగా ఉండడమే మంచిది. నా ప్రస్తుత పార్టీ నాయకులు ఎంత చెత్త పనులను చేస్తున్నారో కేంద్ర హోం శాఖ మంత్రికి తెలియజేసిన నారా లోకేష్ కు తెలుగు ప్రజలు రుణపడి ఉంటారన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడే డర్టీ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి ది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే డర్టీ క్యారెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గురించి సామర్లకోట సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదులో పవన్ కళ్యాణ్ కు ఇల్లు ఉన్నప్పటికీ, మూడేళ్లకు ఒకసారి ఇల్లాలు మారిపోతుందట. ఒకసారి లోకల్, మరొకసారి నేషనల్, ప్రస్తుతం ఇంటర్నేషనలట… ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి చేసుకుంటారని చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డిది ఎంత డర్టీ క్యారెక్టర్ అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ తన కులం గురించి కూడా చెప్పుకోలేక పోతున్నారన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నా రెడ్లు అని సంబోధించారా? అని ప్రశ్నిస్తూనే… నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని పేర్కొన్నారే తప్పితే, ఏనాడైనా నా రెడ్లు, నా క్రిస్టియన్లు అని సంబోధించారా అంటూ నిలదీశారు. తన సొంత సామాజిక వర్గం, మతం వారికే ప్రభుత్వ నామినేటెడ్ పదవులను మాత్రం ఇస్తారు. ఎవరి కులాన్ని వారు ఎంతో కొంత ప్రేమించుకోవడం సహజం. పక్క కులాలని జగన్మోహన్ రెడ్డికి మాదిరిగా ద్వేషించడం దోషమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
జగన్మోహన్ రెడ్డికి కమ్మ కులస్తులంటే ద్వేషం. క్షత్రియులన్న అంతే ద్వేషం. రెడ్డి అనేది కులం కాదు… అది టైటిల్ మాత్రమే. రెడ్డి కులంలో ఎన్నో ఉప కులాలు ఉన్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఏ ఉప కులానికి చెందినవారు. అన్ని కులాలలోనూ రెడ్డి అనే టైటిల్ ఉంటుంది. యాదవులలో రఘువీరారెడ్డికి కూడా రెడ్డి అనే టైటిల్ ఉంది. కమ్మ వారిపై ద్వేషం అనేది తప్పు. కాపుల్ని, పార్టీని కూడా అమ్మేశావని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.
పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రెండో భార్యకు పుట్టిన ముని మనవడివి నువని అన్నారా? అంటూ ప్రశ్నించారు. షర్మిల అంటే నాకు ఎంతో గౌరవం. నా గెలుపుకు జగన్మోహన్ రెడ్డి కంటే ఆమె ఎక్కువ దోహదపడ్డారు. మొదటి సంబంధం చేసుకున్న వ్యక్తితో మనుసులు నచ్చక విడిపోయి రెండవ పెళ్లి చేసుకున్నారు. అందులో తప్పేముంది. అది నువ్వు తప్పని అంటావా జగన్మోహన్ రెడ్డి? అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు.
మీ ముత్తాత చేసింది తప్పు అని అంటావా?, ఆయన ఆ తప్పు చేసి ఉండకపోతే… ఈరోజు రాష్ట్రానికి ఈ దరిద్రం ఉండేది కాదు. ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన కూడా ఈ దరిద్రం ఉండేది కాదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అన్నారా?, ఒక భార్య ఉండగా మరొక భార్యను పెళ్లి చేసుకోవడం తప్పే. చెల్లని పెళ్లికి పుట్టిన వ్యక్తికి, పుట్టిన వ్యక్తికి, పుట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. రెండవ పెళ్లి అనేది నేరం… అయినా ఏనాడైనా పవన్ కళ్యాణ్ ఈ విషయాలను ప్రస్తావించారా? అది ఆయన సంస్కారం. ఆ సంస్కారాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది మనకు లేదు.
కుసంస్కారాన్ని ప్రదర్శిస్తే నీకు రెండు జనరేషన్ల ముందు జరిగిన దాన్ని, నీ జనరేషన్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ది ఈ మట్టి కాదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. అంటే విజయమ్మది విశాఖపట్నమా?, విశాఖపట్నం నుంచి ఆమె ఎందుకు ఎంపీగా పోటీ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాలేరు నుంచి విజయమ్మ, మిర్యాలగూడెం అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారట.
ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్ కు భీమవరానికి సంబంధం ఏమిటని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ తండ్రిది నరసాపురం సమీపంలోని మొగల్తూరు. ఒకప్పుడు మొగల్తూరు భీమవరంలో ఉండేది. ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో ఉన్నది అంతా ఒకటే ప్రాంతం.
ఎక్కడో రాయలసీమ ప్రాంతం నుంచి కడప జిల్లా పులివెందులకు చెందిన మీ తల్లి, విశాఖపట్నం నుంచి పోటీ చేయవచ్చా? అని ప్రశ్నించారు. గాజువాక కు పవన్ కళ్యాణ్ కు ఏంటి సంబంధం అంటే… మీ తల్లి పాలేరు నుంచి మీ చెల్లి మిర్యాలగూడ నుంచి పోటీ చేయవచ్చా? అని నిలదీశారు. ఇలాంటి చెత్త వాగుడు మంచిది కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన తరపున ప్రశ్నిస్తున్నాను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాడేరు, అరకు వ్యాలీలో నివాసం ఉండవచ్చు కదా?!
ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతమే అభివృద్ధిలో వెనుకబడిందని, ముఖ్యమంత్రి ముందు ఫోకస్ చేయాల్సింది రాయలసీమ ప్రాంతం పైనే అన్నారు.
విశాఖపట్నం, విజయనగరం అభివృద్ధిలో ఎంతో ముందున్నాయి. పాడేరు, అరకు వ్యాలీ అభివృద్ధికి నోచుకోలేదని, వాటిని అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పరిస్థితి అయ్యా ఎస్ అన్నట్టుగా తయారయింది. ప్రభుత్వం మారితే 164 స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇచ్చేస్తున్నారు. లేకపోతే కొడతారేమోనని భయం కాబోలు.
ఈ ప్రభుత్వం మారి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేము కూడా 164 స్టేట్మెంట్ తీసుకుంటాము. ఇదే ట్రెండ్ ఫాలో కావలసి వస్తుందే మో. కొట్టినవాణ్ణి కొట్టించానని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. అరెస్టు చేయించిన వారిని అరెస్ట్ చేశానని చెప్పే ధైర్యం లేదు. దొంగ జీవోల ఆధారంగా విశాఖపట్నానికి పారిపోతున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
టోఫెల్ పరీక్షలు ఎందుకు?
మూడవ తరగతి విద్యార్థుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి టోఫెల్ పరీక్షలు నిర్వహిస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. విదేశీ విద్యకు కోసం వెళ్లే వారికి, ఇంగ్లీష్ భాష పై ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇంగ్లీషులో బోధించడానికి ఉపాధ్యాయులు లేరు. ఇంగ్లీష్ బోధించడానికి సైన్స్, హిస్టరీ బోధించే ఉపాధ్యాయులే దిక్కయ్యారు. నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది?
విదేశీ విద్య కోసం వెళ్లే వారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లించి టోఫెల్ పరీక్షలను రాయడానికి సహకరిస్తే మంచిది. జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో విద్యావిధ్వంసం, విద్యా దోపిడీ కొనసాగుతున్నాయి. తొలుత సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతానని చెప్పి, సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడంతో, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతామని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 300 ఇంటర్నేషనల్ సిలబస్ పాఠశాలలు లేవు. కానీ రాష్ట్రంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి 49 వేల పాఠశాలలలో ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జగనన్న కాలనీలలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించండి
సామర్లకోటలో నిర్మించిన జగనన్న కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ లేకుండా, ప్రజలకు నీటి సరఫరా ఎలా చేస్తారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించింది కేవలం రెండు నుంచి మూడు వేల ఇల్లు మాత్రమే. ఈ విషయాన్ని ఆరు నెలల క్రితం పార్లమెంట్లో చెప్పారు.
రాజమండ్రి భూముల్లో 150 కోట్ల రూపాయలను స్థానిక నేతలు స్వాహా చేశారు. అందులో ముఖ్యమంత్రి కూడా వాటా వెళ్లినట్లు తెలుస్తోంది. జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణానికి భారతి సిమెంట్ నే కొనుగోలు చేయాలట. జగనన్న కాలనీలలో నివసించేవారు సాక్షి పేపర్ చదవాలని కండిషన్ పెడతారేమో నని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.