– ’20 సూత్రాల అమలు ఛైర్మన్’ లంకా దినకర్
వెలగపూడి: “అంత్యోదయ” స్ఫూర్తితో నిజంగా అవసరమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కుటుంబంలోని ప్రతి సభ్యుడి వివరాలతో పాటు కుటుంబంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఇతర సామాజిక వివరాలతో ఆధార్ కార్డు లాంటి “కుటుంబ కార్డులు(ఫ్యామిలీ కార్డు) ” విధానాన్ని ప్రవేశపెట్టనుండడం అభినందనీయమని ’20 సూత్రాల అమలు ఛైర్మన్’ లంకా దినకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబాన్ని మొత్తం ఒక యూనిట్ గా పరిగణించకుండా కుటుంబంలోని ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి సంక్షేమ పథకాలు వర్తింపజేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన సంప్రదాయ విధానమైన ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తున్నారు, ఇది మంచి పరిణామని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ అంత్యోదయ నిజమైన స్ఫూర్తితో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.