-పశు సంవర్థకశాఖలో మాజీ మంత్రి తలసాని ఓఏస్డ్ కళ్యాణ్ ఆపీస్ లో పైల్స్ మాయం… విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలి
– ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నగదు బదిలీతో గొర్రెల పంపిణీ ప్రారంభించాలి
జనగాం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జనగామ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని బీరప్ప గుడి కమిటీ హల్ లో జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్ అధ్యక్షతన జరిగింది. దీనికి జిల్లా కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ .. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేసి కోటీశ్వరులను చేస్తామని చెప్పి, మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. పశుసంవర్థక శాఖ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓ ఎస్డ్ కళ్యాణ్ పైల్స్ ను మాయం చేయడం సరైనది కాదు వెంటనే పైల్స్ మాయం సంబంధించిన వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కమీటి తీవ్రంగా ఖండించారు.
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మిగిలి ఉన్న గొర్రెల పంపిణీ నగదు బదిలీ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 2017లో జనగాం జిల్లాలో 22 వేల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసి. 2 సంవత్సరాలలో పంపిణీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచిన గొర్రెల పంపిణీ చేయలేదు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 2500 మంది డీడీలు సంవత్సరం దాటింది,జనగాం జిల్లాలో ఇంక గ్రామ సభలో ఎంపికై 4000వేల మంది లబ్ధిదారులు ఉన్నారు గొర్రెల పంపిణీ చేయకుండా మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం.
నాడు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడం కోసం గొల్ల కురుమలు 99/ శాతం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు. గొర్రెలు పంపిణీ చేయకుండా మోసం చేసింది. ఇప్పుడు బి ఆర్ ఎస్ ఓడించడం కోసం గొల్ల కురుమలు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కొడకండ్ల బహిరంగ సభలో గొల్ల కురుమలను అవమాన పరిచి మాట్లాడినందుకు కేసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు. అధికారంలో వచ్చే కాంగ్రెస్ పార్టీ గొల్ల కురుమల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం గొల్ల కురుమలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనగామ టౌన్ అధ్యక్షులు ఉలిగిల్ల చెంద్రయ్య,జిల్లా ఉపాధ్యక్షలు జీగారి యాదగిరి,కొడకండ్ల మండల అధ్యక్షులు మధ్యబోయిన నర్సయ్య, దేవరుప్పుల మండల అధ్యక్షులు బుమాండ్ల కుమారస్వామి, నర్మట మండల అధ్యక్షులు వేల్పుల రాజు, రఘునాథ్ పల్లి మండల కార్యదర్శి గద్ద రాజు,వెల్దoడ సోసైటీ అధ్యక్షులు శ్రీపతి కుమార్, పులిగిల్ల సీద్దయ్య, లక్ష్మిక్క పెల్లి సోసైటి అధ్యక్షులు జిట్టాబోయిన అంజయ్య, కోడూరు సోసైటీ అధ్యక్షులు గొరిగే యాదగిరి,ఉపేందర్ యాదగిరి, శ్రీమన్నారాయణ పూర్ శ్రీనివాస్,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొన్ని డిమాండ్స్
1. బి ఆర్ ఎస్ పార్టీ గొల్లకూరుమలకు చేపట్టిన గొర్రెల పంపిణిని కార్యక్రమంను ఈ ప్రభుత్వం వెంటనే నగదు బదిలీతో ప్రారంభం చేయాలి.
2. జీవో 559,1016 లను పూర్తి స్థాయిలో అమలు పరిచి ప్రతి సోసైటీ పేరా 10 ఎకరాల భూములు రిజిస్టర్ చేయాలి.
3. ప్రతి గ్రామంలో గొర్రెలకు ఒకేదగ్గర ప్రభుత్వ షెడ్స్ నిర్మాణం చేపట్టిఇవ్వాలి.
4. ప్రమాద వైశ్యత్ చనిపోయిన గొర్రెల మేకలకు ఒక్కదానికి 10 వేల రూపాయలు ఎక్స్ గ్రేసీయా చెల్లించేలా,గొర్రెల మేకలకు, ప్రభుత్వమే ఉచితంగా బీమా పథకం చేపట్టాలి.
5. గొర్రెల మేకలతో ప్రతిరోజు కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి తిరిగి 50 సంవత్సరాలు నిండకా ముందే మోకాళ్ళు నొప్పులతో గొల్లకూరుమలు ఇబ్బంది పడి ఇంట్లోనే ఉంటున్నారు, వారికీ నెలకు 5000/ వేల పించన్ ఇవ్వాలి.
6. గొర్రెల మేకలకాడికి పొతే అడవిలో కాని రాత్రివేలలో మందకాడ పడుకుంటే వర్షకాలం పిడుగులు పడి, తెల్లు పాములు కుట్టి చాలా మంది చనిపోతున్నారు, ప్రమాద వైశ్యత్ చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.