అక్టోబర్ 1న 99వ పుట్టినరోజు జరుపుకున్న 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్
ఎంపీ విజయసాయిరెడ్డి
అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ (జేమ్స్ ఎర్ల్) కార్టర్ (1977 జనవరి–81 జనవరి) ఈ అక్టోబర్ 1న 99వ పుట్టినరోజు జరుపుకున్నారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు.. అత్యధిక కాలం జీవించిన అమెరికా మాజీ అధ్యక్షుడిగా కార్టర్ దే ప్రస్తుతం రికార్డు కానుందన్నారు. తన పదవీకాలంలో అనేక సమస్యలు ఎదుర్కొన్న అగ్రరాజ్యం అధినేతగా ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉందన్న ఆయన 20వ శతాబ్దం చివరి 30 ఏళ్ల నుంచి 2021 జనవరి 20 వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఒకసారి మాత్రమే ఈ అత్యున్నత పదవి ఎన్నికైన ముగ్గురిలో మొదటి నేత జిమ్మీ కార్టర్.
మిగిలిన ఇద్దరు: జార్జి హెచ్.డబ్ల్యూ. బుష్ (1989–93), డొనాల్డ్ ట్రంప్ (2017–2021). 20వ శతాబ్దం చివరి కాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు 90 సంవత్సరాలకు మించి జీవించడం ఈ ఏకైక అగ్రరాజ్యం మరో ప్రత్యేకత అని తెలిపారు. దేశాధ్యక్షునిగా రెండోసారి 1980 నవంబర్ పోటీచేసినప్పుడు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కార్టర్‌ను ఆయన కంటే వయసులో 13 ఏళ్లు పెద్దవాడైన రిపబ్లికన్ అభ్యర్థి, అప్పటికి మాజీ హాలీవుడ్ నటుడు రోనాల్డ్ రేగన్ ఓడించారని గుర్తు చేశారు.
రెండోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికైన రేగన్ 93 ఏళ్లు నిండే వరకూ జీవించారని చెప్పారు. రేగన్ రెండో పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) పేరొందిన ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీకే చెందిన జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ బుష్) దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి 1992 నవంబర్ లో పోటీచేసి తన కన్నా వయసులో 22 ఏళ్లు చిన్నవాడైన డెమొక్రాట్ అభ్యర్థి బిల్ క్లింటన్ చేతిలో ఓడిపోయారు. అయితే, ఆయన పెద్ద కుమారుడు జార్జి డబ్ల్యూ బుష్ (జూనియర్ బుష్) మిలేనియం (2000) అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడమేగాక, తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కూడా గెలిచి తండ్రి సాధించలేనిదాన్ని సాధించారని చెప్పారు.
కొడుకు జూనియర్ బుష్ 8 సంవత్సరాల పదవీకాలంలో జీవించే ఉన్న సీనియర్ బుష్ 94 ఏళ్లు బతికారు. ఈ విషయంలో కొత్త రికార్డు స్థాపించారు. ఆయన 2018 నవంబర్ లో కన్నుమూశారు. ఆయన భార్య, మాజీ ఫస్ట్ లేడీ, జూనియర్ బుష్ తల్లి అయిన బార్బరా బుష్ కూడా దాదాపు 93 సంవత్సరాలు జీవించారని తెలిపారు. భర్త మరణానికి ఏడు నెలల ముందు 2018 ఏప్రిల్ లో బార్బరా కన్నుమూశారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇప్పుడు ఇంకా బతికి ఉండి అత్యధిక కాలం జీవించిన మాజీ అధ్యక్షుడిగా కొత్త రికార్డు సృష్టించిన జిమ్మీ కార్టర్ మాదిరిగానే సీనియర్ బుష్ కూడా 1924లో జన్మించారని తెలిపారు..
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధ్యక్షుడిగా రుజువయ్యాక రాజీనామా చేసిన నిక్సన్
అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువై తన రెండో పదవీకాలం ఆరంభంలోనే పదవికి రాజీనామాచేసిన నేత రిచర్డ్ నిక్సన్. ఆయన మొదటిసారి 1968లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత 1972 నవంబర్ ఎన్నికల్లో రెండోసారి పోటీచేసినప్పుడు ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ నేతల మాటలను దొంగచాటుగా రికార్డు చేయించి విన్నారనే అభియోగం (వాటర్ గేట్ కుంభకోణం) రుజువయ్యాక ఆయన 1974లో రాజీనామా చేశారు. 1913లో జన్మించిన నిక్సన్ 1994 వరకూ జీవించారు.
81 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన రాజీనామా చేసినప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న జెరాల్డ్ ఫోర్డ్ కూడా ఎక్కువ కాలమే జీవించారని తెలిపారు. ఈయన 1976 ఎన్నికల్లో జిమ్మీ కార్టర్ చేతిలో ఓడిపోయారు. ఫోర్డ్ 2006లో 93 ఏళ్ల వయసులో మరణించారు, 1970ల నుంచీ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో 90 ఏళ్లకు పైగా జివించిన మొదటి నేతగా ఫోర్డ్ రికార్డు సృష్టించారు, ఆయన మరో ప్రత్యేకత ఏమంటే–1972 అధ్యక్ష ఎన్నికల్లో రిచర్డ్ నిక్సన్ తోపాటు రిపబ్లికన్ పార్టీ టికెట్‌పై ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నెల్సన్ రాక్ ఫెల్లర్ ఒక అవినీతి కుంభకోణం వల్ల రాజీనామా చేయడంతో 1974 ఆగస్టులో ఫోర్డ్‌ను ఉపాధ్యాక్షుడిగా నామినేట్ చేశారని తెలిపారు.
ఇలా ఆయన ఎన్నికల్లో గెలవకుండానే ఉపాధ్యక్ష, అధ్యక్ష పదవులు చేపట్టారు. పైన వివరించిన అంశాల ప్రకారం చూస్తే–అమెరికా మాజీ అధ్యక్షుల్లో 90 సంవత్సరాలకు మించి జీవించినవారి జాబితాలో నలుగురు–గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్, రోనాల్డ్ రీగన్, జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరైన జిమ్మీ కార్టర్ వచ్చే ఏడాది అక్టోబర్ ఒటిన నూరేళ్లు పూర్తిచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో (జోసెఫ్) బైడెన్ పదవిలో ఉండగా 80 సంవత్సరాలు నిండిన (2022 నవంబర్ 20న) తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారని తెలిపారు.