Suryaa.co.in

Andhra Pradesh

మ‌హిళ‌ల అదృశ్యంపై మళ్లీ ర‌చ్చ

  • ఎన్నిక‌ల ముందు పవన్ ఆరోపణలు
  • 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారన్న పవన్
  • మళ్లీ ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చిన వైసీపీ

అమరావతి: వైసీపీ పాలనలో 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ పదే పదే ప్రచారం చేశారు. మ‌హిళ‌ల మిస్సింగ్ వెనుక వ‌లంటీర్ల పాత్ర ఉంద‌ని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగే కొందరు వలంటీర్లు మహిళల, యువతుల వివ‌రాలు సేక‌రించార‌ని అన్నారు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో ఆయనపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది రాజకీయ ల‌బ్ధి కోసమే అబద్దపు ప్రచారం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పవన్‌ ట్వీట్‌కు వైసీపీ రీట్వీట్..
మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, అదృశ్యానికి సంబంధించి జులై 26, 2023న సోషల్ మీడియాలో ప‌వ‌న్ పెట్టిన పోస్టుకు కేంద్రమంత్రి పార్లమెంట్‌ స్టేట్‌మెంట్‌ను ట్యాగ్ చేసింది. దిశ యాప్ కార‌ణంగా క‌నిపించ‌కుండాపోయిన వారిని పోలీసులు తేలిగ్గా వెతికి ప‌ట్టుకోగ‌లిగార‌ని పేర్కొంది.

అదృశ్యం కావ‌డానికి ముఖ్యంగా ప్రేమ వ్యవహరాలు, ప‌రీక్ష‌ల్లో త‌ప్ప‌డం, ఇంట్లో ఘ‌ర్ష‌ణ‌లు, మాన‌సిక రుగ్మ‌త‌లే కార‌ణమవుతాయని వైసీపీ వివ‌రించింది. వాటిని రాజ‌కీయంగా వాడుకుని త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డంపై ఇప్పుడు ఏం స‌మాధానం చెప్తార‌ని నిల‌దీసింది. 2015-18 మధ్య గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌లో ట్రేస్ కాని అదృశ్యం అయిన మ‌హిళ‌లు 1,542 మంది ఉన్నారని పేర్కొంది. వారంతా కూడా అక్ర‌మ ర‌వాణాకు గురైన‌ట్టేనా చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

30 వేల మందిని తీసుకురావాలని కోరిన కేఏ పాల్
కూట‌మి విజ‌యం సాధించిన వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన కేఏ పాల్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. త‌మ్ముడూ ప‌వ‌న్ కల్యాణ్‌, నువ్వు ఆరోపించిన‌ట్టు ఏపీలో అదృశ్యమైన 30 వేల మంది చిన్నారులు, మ‌హిళ‌ల‌ను వెతికి క‌నిపెట్టి వారి ఫ్యామిలీలకు చేర్చే బాధ్య‌త తీసుకోవాలని సూచించారు. చేతిలో అధికారం ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి అదేమంత కష్టమైన పని కాదన్నారు.

LEAVE A RESPONSE