Suryaa.co.in

Andhra Pradesh

చంద్రన్న పాలనలో భవన నిర్మాణ కార్మికులకు స్వర్ణ యుగం

– టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు

మంగళగిరి: తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టి ఎన్ టి యు సి) అనుబంధ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ చేయించిన తదుపరి తొలి సమావేశం ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీల నియామకం, బలోపేతం పై చర్చించడం జరిగింది.

ఈ సమావేశానికి ఎం ఎల్ సి టిఎన్టియుసి ఇన్చార్జి శ్రీ దువ్వారపు రామారావు, ఎం.ఎల్.సి టిడిపి జాతీయ కార్యాలయ కార్యదర్శి శ్రీ పరుచూరి అశోక్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యి వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న దువ్వారపు రామారావు మాట్లాడుతూ….
టి ఎన్ టి యు సి కమిటీ సభ్యులు కార్మిక లోకంలో చైతన్యం తీసుకువచ్చి గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసి రాష్ట్రంలో ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా టెక్కలి నుండి కుప్పం వరకు కార్మిక చైతన్య బస్సు యాత్ర నిర్వహించి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చేందుకు ఎంతో కృషి చేసిందని చెప్పారు.

గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ….భవన నిర్మాణం రంగం కుదేలయ్యి కార్మికులు పక్క రాష్ట్రాలకు వలసలు పోయి రోడ్డుపాలు అవ్వడానికి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం గత ప్రభుత్వం ఇసుక విధానమే దీనికి మూల కారణమని ఇసుక దొరకనివ్వకుండా చేసి పక్క రాష్ట్రాలకు తరలించి, రాష్ట్రంలో నిర్మాణాలు లేకుండా పోవడం వల్ల కార్మికులకు ఉపాధి కోల్పోయారని తిరిగి ఎన్ డి ఏ ప్రభుత్వం లో కార్మికులకు స్వర్ణ యుగం ప్రారంభం అయిందని కొనియాడారు.

పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ….కార్మికులను చైతన్య పరిచి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును తిరిగి పునర్నిర్మించి గత ప్రభుత్వం తరలించిన 1800 కోట్ల రూపాయలను తిరిగి భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు జమ చేయించే విధంగా కృషి చేద్దామని, కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అందే విధంగా మనం కృషి చేసిన నాడు మిగిలిన కార్మికులు కూడా మన యూనియన్ లో చేరేందుకు అవకాశం ఉంటుందని ఆ విధంగా కార్మిక నాయకులు పనిచేయాలని సూచించారు.

కార్మిక నాయకుని పనితనమే తోటి కార్మికులను ఆకర్షించేలా చేస్తుందని రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం వల్ల నిర్మాణరంగం ఊపొందుకుందని కార్మికులకు నిత్యం పని దొరుకుతుందని కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వంలో మనం ఉన్నామని నారా చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతి నిర్మాణం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రతి ఒక కార్మికునికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత మన కార్మిక నాయకుల పై ఉందని సూచించారు.

తదుపరి ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగునాడు భవన నిర్మాణ కార్మిక సంఘానికి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు 15 మందితో అడ్ హక్ కమిటీని నియమించడం జరిగింది.
కమిటీ సభ్యులు అడ హక్ కమిటీ సభ్యులు…
1. పొన్నమళ్ళ కొండబాబు.
2. ఎస్.కె ఉమర్ వలి.
3. జిక్కి అప్పన్న.
4. కిన్నెర శ్రీనివాసరావు.
5. ఎడ్లూరి నిరీక్షణరావు.
6. ఎన్. శాంతి కుమార్.
7. ఎస్.కె షానవాజ్.
8. మెరుగు మాల సాంబశివరావు.
9. టంటం సత్యనారాయణ.
10. శ్రీనివాసచారి.
11. పి మోహన్.
12. తుమ్మలపల్లి పుల్లారావు.
13. ఎన్ రమణ.
14. లక్కీశెట్టి కనకారావు.
15. కుంచాపు వెంకటేష్

ఈ సమావేశంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జోన్ ఇన్చార్జీలు రెంటపల్లి శ్యామ్, కోగంటి లెనిన్ బాబు, అంబూరు సింధుజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబూరు మల్లికార్జునరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతి శివాజీ, మొకర ఆదిబాబు, రాష్ట్ర కార్యదర్శులు బుస్సే నాగ ప్రసాద్, నిరీక్షణరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లక్కిశెట్టి కనకారావు, జిల్లా అధ్యక్షులు నక్క లక్ష్మణరావు, సుంకర విష్ణు కుమార్, విక్రమ జగన్నాథం, కొండవీటి శివయ్య, పొన్నమళ్ళ కొండబాబు, నాగార్జున, జిల్లా కార్యదర్శి పళ్లెం సుబ్బారావు, నియోజవర్గ అధ్యక్షులు బురుసు శివయ్య, పుల్లారావు, మరియు వివిధ జిల్లాల నుంచి భవన నిర్మాణ రంగ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE