Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకి తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర స్వాగతం లభించింది.తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం మధ్యాహ్నం జిల్లాకు విచ్చేసిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా.గురు మూర్తి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ లు రాజేష్ కుమార్ గోయల్, ప్రశాంత్ కుమార్ సూర్యదేవర, హైకోర్టు జడ్జి యు. దుర్గాప్రసాద్, రిజిస్ట్రార్ డి. వెంకటరమణ, ఎ.వి రవీంద్రబాబు, జిల్లా జడ్జి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి,గౌ. మూడవ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, గౌ. ప్రోటోకాల్ మెజి స్ట్రేట్ కోటేశ్వర రావు,గౌ. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్. సురేష్, తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి, ప్రోటోకాల్ సూపరిండెంట్ ధనుంజయ నాయుడు సంబంధిత అధికారులు స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE