Suryaa.co.in

Political News

భవిష్యత్తు తరాలకు దారి చూపించిన మార్గదర్శి

30 ఏళ్ళు రాకుండానే మంత్రి 50 ఏళ్ళు రాకుండానే ముఖ్యమంత్రి అయ్యావ్
అందులో లోపాలు వెతికే వాళ్ళు వెతుక్కోవచ్చు
మంత్రిగా నువ్వు సాధించిన విజయాలు ఏంటో నాకు తెలియదు గాని ముఖ్యమంత్రిగా నువ్వు సాధించిన విజయాలు
భవిష్యత్తులో కూడా ఎవడూ కూడా సాధించలేనివి
దీర్ఘకాలిక అవసరాలను చూసుకుని నువ్వు తవ్విన ఇంకుడు గుంతలు గాని,
ప్రపంచంతో తెలుగోడు పోటీ పడాలని నువ్వు కట్టిన హైటెక్ సిటీ గాని…
నా తెలుగింటి ఆడపడుచు తలెత్తుకు బ్రతకాలని నువ్వు ప్రవేశపెట్టిన డ్వాక్రా గాని…
ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని ఉండాలని… రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గానీ…
రైతులకు దళారీ వ్యవస్థ ఉండకూడదని నువ్వు తీసుకొచ్చిన రైతు బజార్లు గాని…
కుటుంబ పెద్ద పోతే ఆదరణ కరువయ్యే కుటుంబాల కోసం ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా గాని…
ప్రజల వద్దకు పాలన అంటూ నువ్వు తీసుకొచ్చిన ఈ సేవ గాని…
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలతో అవసరం లేదని నువ్వు సృష్టించిన ఆర్ధిక వనరులు గాని…
రాజధాని లేని రాష్ట్రానికి నువ్వు నిర్మించిన రాజధాని గాని…
నదుల అనుసంధానం అంటూ నువ్వు కట్టిన పట్టిసీమ గాని…
కొడుకుల మీద ముసలోళ్ళు ఆధారపడకూడదు అని తెచ్చిన పించన్లు గాని…
వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం మారితే ఆపెసేవి, ఆగిపోయేవి కాదు… కేవలం నీ మదిలో మెలిగిన ఆలోచనలు…
ప్రతిపక్ష నేత అంటే… ప్రభుత్వానికి లొంగిపోయే వాడు కాదు… సబ్జెక్ట్ తో మాట్లాడే వాడని నువ్వు నిరూపించావ్…
కాని ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్, 108 వంటి మూడు అంటే మూడు పథకాలతో మహా నేత అయితే…
నిన్ను జననేత అనడం మానేసి… నువ్వు భవిష్యత్తు తరాల కోసం చేసిన పనులను మర్చిపోయి… మాస్ లీడర్ వి కాదని… నిన్ను వదిలేసిన తర్వాత ఆవస్థలు పడుతున్న తెలుగోడిని చూస్తే జాలికలుగుతుంది…
ఆరు పదుల వయసులో రోజుకి 18 గంటలు కష్టపడాలి అని భవిష్యత్తు తరాలకు దారి చూపించిన మార్గదర్శి నువ్వు…
నీలో కులం చూసారు, కుళ్ళు రాజకీయ నేతను వెతికారు, స్వార్ధం వెతికారు వద్దన్నారు…
నాకు తెలిసిన మహానేత నువ్వే…!

– పెంచెల్‌రెడ్డి

LEAVE A RESPONSE