– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా వారిని ప్రోత్సహించాలి. వారిని ప్రలోభాలకు, బెదిరింపులను లోను చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేయాలి.
అదే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మాత్రం వారిపై చర్యలు అంటూ హంగామా చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వమని చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాంగ్రెస్ చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తుంటే జాలేస్తోంది.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ చీకటి రోజులు మొదలయ్యాయి. కరెంటు కోతలు, విత్తనాల కోసం క్యూలు, ఎరువుల కష్టాలు, వ్యవసాయ రుణం మాఫీ టోకెన్ల కోసం బ్యాంకుల బయట పడుకోవడం. ఇది రైతుల పరిస్థితి. ఈ చేతగాని ప్రభుత్వం 9 నెలల్లో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా తయారయిందో ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది! మనకి అన్నం పెట్టే రైతుకి కనీసం చేయూత అందించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఉండి ప్రయోజనం ఏమిటి? 2023లో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసిన రైతులకి ఇప్పుడు ఏంటి ఈ దుస్థితి?