-తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి కిట్లు కావాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయండి
-నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాల్నా
-తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది
-హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే సతీష్ బాబు లాగా ఉండాలే. నిజాయితీగల శాసనసభ్యుడు. ఆ రోజుల్లో గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డా అంటే మాకు కాపిటల్ లక్ష్మీకాంతరావు. కొన్ని వందలసార్లు ఉద్యమంలో అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు మా సతీష్ అన్నది.
తెలంగాణ కోసం గట్టిగా నిలబడేటువంటి మంచి మనసున్న కుటుంబం మా కెప్టెన్ గారి కుటుంబం.రాష్ట్రంలో ఎవరినడిగినా మూడో సారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కెసిఆర్ అనే సమాధానం వస్తుంది. హుస్నాబాద్ లో కూడా మూడోసారి సతీష్ కుమార్ ని గెలిపించుకుందాం.
హుస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయినయ్ అంటే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇది కేవలం కేసీఆర్ వలన సాధ్యమైంది.మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది.గండి మహాసముద్రం ఏడాది లోపట నిర్మించి నిలిచినం.గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు అయినా సరే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది BRS ప్రభుత్వం.
ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది.కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా, కల్యాణ లక్ష్మి ఇచ్చారా, మిషన్ భగీరధ మంచినీళ్లు ఇచ్చారా.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతది.
చీప్ ట్రిక్కులకు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు.తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది.గులాబీ సైనికులుగా మనం ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలి.కాంగ్రెస్ పాలిత చత్తీస్ గడ్, కర్ణాటకలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయా.కాంగ్రెస్ అధికారములో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజలను ఓట్లు అడగండి.
కెసిఆర్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పని హామీలను కూడా నెరవేర్చారు.కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పలు పెట్టినా కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేసిండు.రాష్ట్రంలో బిజెపి బిచాణ ఎత్తేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎలక్షన్లు అంటుంది.తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు.ఇండియా పాకిస్తాన్ మధ్య కొట్లాట, హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బిజెపి గెలవాలనుకుంటుంది.
రైతు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాల్నా.రైతుబంధు కింద 72,000 కోట్లు రైతుల ఎకౌంట్లో వేసాం.60 వేల కోట్లతో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాము ఇప్పటివరకు.హుస్నాబాద్ కి ఆర్డిఓ ఆఫీస్ తెచ్చింది ఎమ్మెల్యే సతీష్. హుస్నాబాద్ లో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం సతీష్ బాబు వల్లే.
హుస్నాబాద్ లో గత పాలకులు కడుపులు నింపుకునే పనిలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి జరగలేదు. పేదల కడుపు నింపే నాయకుడు సతీష్ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి జరిగింది.తెలంగాణ ప్రజలను నూకలు బుక్కమన్న బిజెపికి నూకలు లేకుండా చేశారు ప్రజలు.కాంగ్రెస్ బిజెపి తిట్లలో పోటీపడితే మనమేమో కిట్లతో పోటీ పడుతున్నాము.
కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు. తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి కిట్లు కావాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయండి.పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు 16వ తారీఖున ప్రారంభం చేయనున్నారు. దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయి.ఇంటిముందు అభ్యర్థి కంటి ముందు అభివృద్ధి ఎమ్మెల్యే సతీష్ నీ గెలిపించండి.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.