మహానందిలో మహాద్భుతం

కర్నూలు జిల్లా నంద్యాల ప్రముఖ శివ క్షేత్రం మహానందిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరాలయం క్రింది నుంచి ఊట నీరు వేగంగా వస్తోంది. నీటి ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో..

రుద్రగుండం కోనేరులో జలపాతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.కాగా,ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించి పోతున్నారు.పరమేశ్వరుని మహిమ వల్లే ఇలా జరిగిందంటూ చెప్పుకొంటున్నారు.మహానందిలో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము.

నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న ఈ మహానందిలో.. మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి కొలువై ఉన్నారు.7వ శతాబ్దంలో నిర్మితమైన ఈ మహానందీశ్వరాలయం శిల్ప శైలి మహాద్భుతం అని చెప్పాలి. బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలమైన 680-696 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అంచనా . ఈ ఆలయంలో కొలువైన శివలింగం మిగతా ప్రాంతాల్లోని శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది.

Leave a Reply