బిడ్డ కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టిన తల్లి
పేగుబంధం గొప్పది. తన ప్రాణం పోయినా బిడ్డ ప్రాణాలు నిలవాలన్న తల్లిప్రేమ, చివరకు గొప్ప సాహసానికి పూనుకుంది. ఆ ప్రయత్నంలో తాను చనిపోతానని ఆ తల్లిమనసుకు తెలుసు. తన శరీరం ఛిద్రమైపోతుందనీ అమ్మకు తెలుసు. తానొక అనాధ శవంలా మిగులుతాననీ తెలుసు. కానీ బిడ్డ బతికుంటే చాలు. నవమాసాలూ మోసి కన్న తన బిడ్డ బతికుంటే అదే మహద్భాగ్యం అనుకుంతి ఆ పిచ్చితల్లి! అదే ఆ తల్లి తపన. చావు బతుకుల పోరాటంలో.. చివరకు తల్లిమనసే గెలిచింది. ఎంతైనా అమ్మ.. అమ్మే!! యస్. అమ్మే గెలిచింది. చుక్క నెత్తురు చిందించకుండా సజీవంగా ఉన్న తన బిడ్డను చూసి మురిసిపోయి, ముద్దులు కురిపించింది ఆ తల్లి. అవును. ఎప్పుడూ అమ్మే గెలుస్తుంది. గెలవాలి కూడా! రోమాలు నిక్కబొడుకుచుకునే ఈ దృశ్యం, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
అది బీహార్‌లో ఒక రైల్వే స్టేషన్. రైలు ఎక్కుతుండగా తోపులాటలో ఓ మహిళ బిడ్డతో సహా ట్రాక్, ప్లాట్ఫామ్ మధ్య పడిపోయింది. వెంటనే రైలు కదలడంతో చిన్నారిని రక్షించడానికి బిడ్డపై పడుకుంది. ట్రైన్ వెళ్లగానే ప్రయాణికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం చూసిన అందరికీ మనసు కలిచివేసింది.