Suryaa.co.in

Telangana

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యునిగా ఎ.మురళీముకుంద్

హైకోర్టులో ఎ.మురళీ ముకుంద్ కి ఊరట

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రస్తుత కార్యదర్శి ఎ.మురళీ ముకుంద్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఎ.మురళీ ముకుంద్ ని తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యునిగా కొనసాగించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. WP నం. 37576/2022 ప్రకారం 28.09.2022న హైకోర్ట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రస్తుత సెక్రటరీ ఎ. మురళీ ముకుంద్ సభ్యునిగా పరిగణించబడతారు. 18.09.2022 జనరల్ బాడీ మీటింగ్‌లో జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రస్తుత కార్యదర్శి ఎ.మురళీ ముకుంద్ ని ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంపై కోర్టుని ఆశ్రయించారు.

17.09.2022 న ఎ.మురళీ ముకుంద్ ని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ షోకాజ్ నోటీసు మరియు ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించలేదని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎ.మురళీ ముకుంద్ తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ 18.09.2022న విడుదల చేసిన మునుపటి ప్రెస్ నోట్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని రుజువైంది.

పైన వెలువడిన ఆదేశాలు, 18.09.2022 జనరల్ బాడీ సమావేశం సందర్భంగా జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించబడిన ఇతర సభ్యులకు కూడా వర్తిస్తాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్ట్ అక్టోబర్ 10, 2022 కి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE