– ఇప్పుడు రష్యా ఒకపక్క 31 దేశాలతో యుద్ధం చేస్తూ.. మరోపక్క తన సైన్యంతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది
వ్యాగన్ఆర్ గ్రూప్ అనేది రష్యా యొక్క ప్రైవేట్ సైన్యం. రష్యా లోని వివిధ జైల్లో ఉన్న జీవిత ఖైదీలతో మాట్లాడి మీరు మీ జీవితాన్ని ఈ జైలులో గడిపేస్తారా లేదంటే సైన్యంలో చేరి విముక్తి పొందుతారా అని మాట్లాడి ఆ ఖైదీల అందరిని మరియు ఆ నేరస్తులందరినీ రష్యా సైన్యంలో భాగంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి దాని పేరు వ్యాగన్ఆర్ గ్రూప్ అని పెట్టి. . ఈరోజు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో ఈ వేగన్ఆర్ గ్రూపు సైన్యాన్ని ముందు పెట్టి ఆ తరువాత రష్యా సైన్యం ముందుకు వెళుతూ ఉన్నది.
ఈ మధ్యకాలంలో వేగన్ఆర్ గ్రూప్ ఉక్రేనియన్ పై విజయం సాధించి కొన్ని నగరాలను స్వాధీనం చేసుకుని అక్కడ కాపలాకాస్తున్న ప్రైవేటు సైన్యాన్ని రష్యా సైన్యం వచ్చి వారిని వెళ్లగొట్టి ఆ ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉన్నది అని వాగన్ఆర్ గ్రూపు నాయకుడు ఈ మధ్యకాలంలో ఆరోపణలు కూడా చేశారు.