– ఇక్కడ సరేనన్న బీజేపీ అక్కడ యుటర్ను తీసుకుంది
– కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాహుల్, ఖర్గేను కోరాం
– మా వివరణకు రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు
– కేంద్రం ఆమోదం తెలపకుంటే రాహుల్ నేతృత్వంలో ఉద్యమం
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు ,ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించాం. తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించాం.
కుల సర్వే శాస్త్రీయబద్ధంగా తెలంగాణలో నిర్వహించాం. రెండు గంటలపాటు సమావేశం జరిగింది. మేం ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే విన్నారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న బిల్లులపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ లకు వివరించాం. గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన బిల్లులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి.
రాష్ట్రం పంపిన బిల్లుల ఆమోదానికి కేంద్రంతో పోరాడాలని విజ్ఞప్తి చేశాం. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించేందుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలని కోరాం. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసింది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.
బిజెపి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. శాసనసభలో బీజేపీ ఓటు వేసింది. కేంద్రం వద్దకు వచ్చే సరికి బిజెపి యూ టర్న్ తీసుకుంది. 9 వ షెడ్యూల్ లో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతాం.
సాయంత్రం 5 గంటలకు ఇందిరా భవన్ లో కాంగ్రెస్ ఎంపీలకు కుల గణన పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తారు. రోల్ మోడల్ గా మారింది తెలంగాణ. కేంద్రం ఆమోదం తెలపకుంటే రాహుల్ నేతృత్వంలో ఉద్యమం చేస్తాం.