– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలి
– నారా చంద్రబాబు నాయడు
అదే వ్యధ… అదే దారుణం! విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ చనిపోయాడన్న వార్త మనసును కలచివేసింది.
ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు. బిడ్డ చనిపోయాక మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ ఇవ్వకపోతే రూ.3 వేలు అప్పుచేసి ప్రైవేటు వాహనంలో రైల్వే స్టేషన్ కు తెచ్చారు. పేదలు చనిపోతే వారి మృతదేహాలు తరలించడానికి అంబులెన్స్ ఇవ్వరా? ఏమిటీ అమానవీయ పరిస్థితి? ఈ పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరుతున్నా. కనీసం మీరైనా దయచేసి ఆ అడవి బిడ్డల మరణ ఘోష పై ఒక్కసారి సమీక్ష చేయండి. తగు చర్యలు తీసుకోండి!