అయోధ్యకు భక్తులను తీసుకెళ్లనున్న బీజేపీ

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. తెలంగాణలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున అయోధ్య యాత్ర చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి.. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. అయోధ్యకి వెళ్లి రావడానికి 5రోజుల సమయం పడుతుంది.

Leave a Reply