Suryaa.co.in

Andhra Pradesh

ప్రమాదం లేని ప్రయాణం

– నీటి ప్రమాదాలు నుండి ప్రయాణికులకు రక్షణ కల్పించిన లోకేష్

దుగ్గిరాల: కొత్త లాకులు వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై ఉన్న ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ దెబ్బతిన్న కారణంగా గడిచిన నాలుగు ఏళ్లుగా రైతులు, వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అనునిత్యం భయం భయంతో ప్రయాణం చేశామన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసన సభ్యుడు, నారా లోకేష్ ఆదేశాలు మేరకు దుగ్గిరాల కొత్త లాకులు వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై ఉన్న ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

నాలుగు సంవత్సరాల కాలం నుండి ఎంతో మంది ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఈ ఫుడ్ బ్రిడ్జిపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉందని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, గ్రామస్తులు వాపోయారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ పనులు జరగడంతో దుగ్గిరాల గ్రామ ప్రజలు, రైతులు, వాహనదారులు, ఇరుగు పొరుగు గ్రామస్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలు, రైతులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ఫుడ్ బ్రిడ్జి సైడ్ వాల్స్ పనులు శరవేగంగా జరగడంతో దుగ్గిరాల మండల ప్రజలు, వాహనదారులు, రైతులు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE