Suryaa.co.in

Andhra Pradesh

అసలు నిందితులను కాపాడేందుకే పాత సామాన్లు దొంగతనం చేసేవారిపై నెపం

-పాత సామాన్లవారికి కాకాణి ఫైలే దొరికిందా?
– నిన్న కాకాని గోవర్థన్ రెడ్డి విల్లాకు వచ్చిన వ్యక్తి శవమయ్యాడు
– ఆ శవమెవరిది?, ఆ వ్యక్తి ఎవరు?, శవాన్ని ఎందుకు మాయం చేశారు?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్

నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ కేసుపై సీఎం, హోం మంత్రి, డీజీపీ ఎందుకు స్పందించలేదో చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ప్రశ్నించారు. అసలు నిందితులను కాపాడేందుకే పాత సామాన్లు దొంగతనం చేసేవారిపై నెపం నెడుతున్నారు.

పాత సామాన్లవారికి కాకాణి ఫైలే దొరికిందా? రాష్ట్రంలో, జల్లాల్లో్, మండలాల్లో, గ్రామాల్లో, 175 నియోజకవర్గాల్లో దొంగలు పడ్డారు. వీరంతా వైసీపీ దొంగలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఎమ్మెల్యేలందరూ ఒక దొంగల ముఠాలాగ తయారయ్యారు. వీరంతా కలిసి రాష్ట్రాన్ని సినిమా ఫక్కీలో దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలే దొంగతనాలకు, హత్యలకు పాల్పడుతుంటే ఇక రాష్ట్రానికి రక్షణ ఏదీ? సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక దొంగల ముఠాలా తయారయ్యారు. రాజకీయ నాయకులే హత్యలకు పాల్పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ఎస్పీ ఆఫీసుకి అతి చేరువలో ఉన్న, నిత్యం జన సమర్థంగా ఉండే కోర్టు ప్రాంగణంలో పట్టపగలు చోరీకి పాల్పడితే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఒక ముఖ్యమైన కేసు మూడు రోజుల క్రితం మంత్రి అయిన వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దొంగతనం చేయించాడనడానికి ఇంకేం కావాలి. ఆయన కనుసన్నల్లోనే చోరీ సంఘటన జరిగింది.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సింగపూర్ లో 15వందల కోట్లు వ్యాపారం చేస్తున్నారని ఫోర్జరీ పత్రాలు సృష్టించి కాకాణి గోవర్థన్ రెడ్డి నానా హంగామా చేసి తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు ఆరోపణలు నిరూపిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు వేశారు. ఆ కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాల్లో కాకాణి గోవర్థన్ రెడ్డి సృష్టించిన పత్రాలు ఫోర్జరీవి అని తేలింది. జూన్ మొదటి వారంలో ఆ కేసును విజయవాడ ప్రత్యేక కోర్టుకి బదిలీ చేయడం జరిగింది. తన బండారం బయట పడుతుందనే భయంతో ఆ కేసు విచారణకు హాజరవకుండా ఉండటానికి సినిమా ఫక్కీలో నాటకమాడారు.

దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా కోర్టులో దొంగతనం చేయించి రికార్డులు మాయం చేయించారు. తప్పించుకోవాలని చూడ్డం ఎంత విచిత్రం. జగన్ రెడ్డి దొంగ మంత్రిమండలి సభ్యులను తన కోటరీలో నియమించుకున్నాడు. ఎస్పీ విజయరావు ఖాకీ బట్టలు విప్పేసి సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది. ఐపీఎస్ చదివి రాజ్యంగబద్దమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులా చేసేది? ప్రభుత్వానికి వంత పాడుతూ, నేరస్థులను బయటపడేసే పనులు మానాలి. అసలు నేరస్థుల్ని చట్టానికి అప్పగించాలి. కుటిల ప్రయత్నం చేసిన ఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలి. జగన్ బాబాయిని బాత్ రూమ్ లో చంపి నాటకం నడిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. ప్రభుత్వం అమ్మే చీప్ లిక్కర్ తాగి అది రుచిగా లేదని, రేటు ఎక్కువగా ఉందని మంత్రి పెద్డిరెడ్డిని, సీఎం జగన్ ని ఓ దళితుడు తిట్టాడు. ఆ మరునాడే ఆ దళిత యువకుడిని చంపి ఉరివేసుకొని చనిపోయాడని నాటకమాడారు. ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు? అభూత కల్పనలు సృష్టించి అమాయకుల ఉసురు పోసుకుంటున్నారు. ఆర్థిక నేరస్థులు పెరిగిపోయారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. మూడు సంవత్సరాల నుండి నేరాలు, ఘోరాలు బయటపడుతూనే ఉన్నాయి.

కోర్టు జడ్జీలనే తిడుతున్నారు. కోర్టులో పత్రాలు దొంగలిస్తున్నారు. సాక్షాలు దొరుకుతాయని మనుషులను చంపేస్తున్నారు. శవాలను మాయం చేస్తున్నారు. మూడు బీరువాలు ఉండగా ఈ బీరువానే ఎందుకు తీశారు. సోమిరెడ్డి ని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు. ఆ వ్యక్తి మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లాడో, ఏం మాట్లాడాడో తెలియాలి. మంత్రి పదవి వచ్చిన మూడు రోజులకే కోర్టులో దొంగతనాలు చేయించడమా? దొంగతనం వివరాలు, చనిపోయిన వ్యక్తి వివరాలు నా వద్ద ఉన్నాయి. నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రిని, ప్రభుత్వాన్ని, జగన్ ను సవాల్ చేస్తున్నాను.

సాక్ష్యాధారాలను తారుమారు చేసే దుష్ట సాంప్రదాయానికి స్వస్తి పలకాలి. ఇలా హత్యలకు పాల్పడుతూ పోతే ఈ రాష్ట్రం ఏం కావాలి? దేశంలో ఒక భాగంగా ఈ రాష్టం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రానికి వేరే హక్కులు, సార్వభౌమాధికారాలు ఏవైనా ఉన్నాయా? సార్వభౌమత్వాన్ని ఈ ప్రభుత్వం అంగీకరిస్తున్నదో లేదో అర్థం కావడంలేదు. ఈ రాజ్యంగ ఉల్లంఘన ఎందుకు జరుగుతోంది? చట్టాన్ని ఎందుకు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు? ఇలాంటి మరెన్నో సంఘటనలు భూస్థాపితమయ్యాయి. దుర్మార్గాలు బయటికి వస్తే కాకమ్మ కబుర్లు, కట్టుకథలు చెప్పి తప్పించుకుంటున్నారు.

ఏ కేసులో కూడా నిజాలు బయట పెట్టలేదు. కోడికత్తి కేసులో చంద్రబాబునాయుడుపై బురద జల్లారు. చంద్రబాబు తనను హత్య చేయించడానికి పాల్పడ్డాడని ఆనాడు జగన్ ఆరోపించారు. సీఎం అయి మూడు సంవత్సరాలు గడచినా నిరూపించలేక పోయారు. సాక్షి పై చర్యలు శూన్యం. కాకాణి గోవర్థన్ కోర్టు పత్రాలు దొంగలించడం తన ఇంటికి సాక్షానికి వచ్చిన వ్యక్తిని నేరానికి పాల్పడిన వ్యక్తిని చంపించటం శవాన్ని మాయం చేయడం జరిగింది. జగన్ పై ఉన్న 11 కేసులు తప్పించుకోవడానికి ట్రైల్ వేసుకున్నట్టుంది. ఎన్ని కోర్టుల్లో దొంగలు చొరబడతారో; ఫైళ్లు ఎత్తుకెళ్తారో అలా పాల్పడిన వ్యక్తుల్ని ఎంతమందిని హత్యలు చేయించడానికి చట్టాన్ని చాప చుట్టేయడానికి నిదర్శనాలు.

గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ఐజేఎం విల్లాలో కాపురం ఉంటున్న కాకాని గోవర్థన్ వద్దకు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి మరో వ్యక్తితో కలిసి నిన్న ఆ విల్లాకు వచ్చారు. వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. సినిమా ఫక్కీలా జరిగింది. నిన్న కాకాని గోవర్థన్ రెడ్డి విల్లాకు వచ్చిన వ్యక్తి శవమయ్యాడు . ఈ హత్య వెనుక ఉన్న మిష్టరీ వీడాలి. ఆ శవమెవరిది?, ఆ వ్యక్తి ఎవరు?, శవాన్ని ఎందుకు మాయం చేశారు? తేలాలి. కాకాణి గోవర్థన్ రెడ్డిని మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి. కాకాణి గోవర్థన్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

 

LEAVE A RESPONSE