– జీవో నెంబర్ 1ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇక, రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.