– బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కార్యక్రమాలపై మాట్లాడని హోం మంత్రి, జగనన్నపై ఎందుకు ద్వేషం?
– హోం శాఖ పనితీరు 36వ స్థానానికి పడిపోవడానికి మంత్రి అనిత అసమర్ధతే కారణం
– దమ్ముంటే కుప్పం, పిఠాపురం, నెల్లూరు ఘటనలపై నిందితులను అరెస్టు చేయండి
– మీరు సెంటీమీటర్ చేస్తే.. మేం కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
– కదిరి ఘటనలో నిందితుడు వైయస్సార్సీపీ కార్యకర్త కాదని జనసేన నేతలే స్పష్టం చేశారు
– చంద్రబాబు తన తల్లి, చెల్లెల్లకు ఇచ్చిన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
– వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తాడేపల్లి: వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పండుగలా జరుపుకున్నారని, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు.
జగనన్న పుట్టిన రోజు సందర్భంగా జంతు బలి చేస్తే తప్పైందా అని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జంతు బలి ఇవ్వలేదా, పవన్ కళ్యాణి సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్లో కత్తులు ఊపించలేదా?. అప్పుడేందుకు ఈ హోం మంత్రి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వీరికి తప్పకుండా రిటర్న్ గిప్ట్ ఇస్తామని వరుదు కళ్యాణి హెచ్చరించారు.
జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో కొన్ని చోట్ల జంతు బలి ఇచ్చారంటూ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం. ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడిపై తమకు నచ్చిన విధంగా అభిమానం చూపిస్తారు, అందులో తప్పేముంది?. బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటనలపై, పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కార్యక్రమాల్లో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలపై అప్పట్లో హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదు. మీకో న్యాయం, మాకో న్యాయమా? రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాంగమా? ఉంటుందా? కూటమికి ఒక రాజ్యాంగం, వైయస్సార్సీపీకి మరో రాజ్యాంగమా? .
నిజంగా జంతు బలులు నిషేధమైతే అందరికీ వర్తించేలా ఒకే రూల్ తీసుకురావాలి. అక్రమ కేసులు పెట్టేందుకు, కక్షసాధింపులకు పుట్టిన రోజు వేడుకలను సాకుగా చూపించడం ఎంత వరకు సమంజసం. హోం మంత్రి ‘ఇక్కడ ఉన్నది సీబీఎన్’ అంటూ బెదిరింపుల ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైయస్సార్సీపీ కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు. మీరు మాపై సెంటీమీటర్ చేస్తే, మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నది గుర్తు పెట్టుకోండి.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపై హోం శాఖ పూర్తిగా విఫలమైంది. కుప్పంలో వివాహితపై జరిగిన అత్యాచారం, నెల్లూరులో టీడీపీ కార్యకర్తల రౌడీయిజం, పిఠాపురంలో మహిళపై జరిగిన దాడి వంటి ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకునే విషయంపై దృష్టి పెట్టాలి. నిజంగా దమ్ముంటే టీడీపీకి చెందిన నిందితులను నడిరోడ్డుపై నడిపించి అరెస్టు చేసి శిక్షించాలి.
నాడు జగనన్న ఇంటి పట్టా ఇస్తే ఆనందం వ్యక్తపరిచిన తెనాలికి చెందిన గీతాంజలిని టీడీపీ, ఐటీడీపీ కార్యకర్తలు ట్రోలింగ్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు కూడా వైయస్ జగన్‌పై అభిమానం చూపితే వారి కుటుంబాలను టార్గెట్ చేసి వేధించిన చరిత్ర టీడీపీదే. కదిరి ఘటనలో నిందితుడు వైయస్సార్సీపీ కార్యకర్త కాదని స్వయంగా జనసేన నాయకులే చెప్పారు.
హోం మంత్రి నోరు తెరిస్తే తల్లి, చెల్లి అంటూ వైయస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు తన తల్లి, చెల్లెల్లకు ఎంత ఆస్తి ఇచ్చారో, హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారో బహిరంగంగా చెప్పేందుకు అనిత సిద్ధమా?